సిగరెట్ పీల్చడం.. రౌండ్ రౌండ్‌గా పొగలు వదలడం చాలామందికి అలవాటు. అయితే స్మోకింగ్‌తో క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని స్మోకింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా చాలామటుకు స్మోకింగ్ చేసే వారి సంఖ్య తగ్గిందనే చెప్పాలి. 20కి పైబడిన పురుషులకు పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమనే విషయాన్ని ప్రభుత్వం నొక్కి చెప్తోంది.
అయితే ఇక్కడ ఓ స్కూల్ స్టూడెంట్ పడుతున్న వర్షంలో కాస్త వెచ్చగా వుంటుందనుకున్నాడో ఏమోకానీ సిగరెట్ స్మోక్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇది ఎక్కడ జరిగిందో కానీ.. వీడియో సిగరెట్ పీల్చుతూ బాలుడు కనిపించాడు. వెనక నుంచి ఎవరొస్తున్నారో చూస్తూ స్మోక్ చేస్తున్నాడు. దూరంలో ఓ మహిళ వస్తుండటాన్ని చూసిన ఆ బాలుడు ఆమె దగ్గర పడ్డాక సిగరెట్ ముక్కను పారేశాడు.
ఈ వీడియోకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే తమ్ముడూ ఏం అవసరం లేదు.. నెమ్మదిగా స్మోక్ చేయమంటూ కామెంట్ చేశాడు.