Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీకి షాకివ్వనున్న జేడీయు : ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు

భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయ

బీజేపీకి షాకివ్వనున్న జేడీయు : ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు
, సోమవారం, 25 జూన్ 2018 (15:51 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన మరో భాగస్వామ్య పార్టీ అయిన జేడీయు కూడా ఆ కూటమికి షాకివ్వనుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరుకు సై అంటూ సంకేతాలు పంపించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకెలాంటి అభ్యంతరాలు లేవని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.
 
ఇదే అంశంపై జేడీయు అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ స్పందిస్తూ, 'బీజేపీకి తన మిత్రపక్షాల సాయం అవసరం లేదనుకుంటే.. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేయవచ్చు. వారికి ఎవరూ అడ్డుచెప్పడం లేదు. సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రతిపార్టీకీ ఉంది. ఒకవేళ వారు నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. మాకు ఎలాంటి సమస్యా లేదు' అని చెప్పారు.
 
'2014 ఎన్నికలకు, 2019కి చాలా తేడా ఉంది. దేశంలో ఆయా అంశాల ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఉండే అంశాలు 2014 కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి నితీశ్ లేకుండా బీహార్‌లో నెగ్గడం కష్టమని బీజేపీకి బాగా తెలుసు' అని సంజయ్ వ్యాఖ్యానించారు.
 
2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకుగానూ జేడీయూ 71 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 53 స్థానాలు దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి తాము బీజేపీ కంటే బలంగా ఉన్నామంటున్న జేడీయూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే తరపున రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న నిర్ణయం తమకే వదిలేయాలని పట్టుపడుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌తో కలిస్తే జనసేన మటాష్ : సీపీఐ నేత రామకృష్ణ