Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీ బీజేపీకి కొమ్ముకాస్తున్నారు.. తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు?

దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది. తమిళనాడుకు లభ

Advertiesment
రజనీ బీజేపీకి కొమ్ముకాస్తున్నారు.. తమిళ లారీ డ్రైవర్‌పై దాడి జరిగినప్పుడు?
, ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (12:40 IST)
దశాబ్ధాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తలకు దారితీసింది. తమిళనాడుకు లభిస్తున్న జలాలను 192 టీఎంసీల నుండి 117.25 టీఎంసీలకు, అంటే 14.5 టీఎంసీ మేర తగ్గిస్తూ, ఈ నదీ పరివాహక ప్రాంతంలో లేని బెంగళూరు నగరానికి అదనంగా 4.75 టియంసిల మేరకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది.
 
నీటి కొరతను భూగర్భజలాలను అన్వేషించడం ద్వారా భర్తీచేసుకోమని తమిళనాడుకు సలహా ఇచ్చింది. అయితే కావేరీ జలాలపై కేంద్రం బోర్డు ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సినీ తారలు ఆందోళన బాట పట్టారు. కావేరి బోర్డు ఏర్పాటుచేయాలంటూ తమిళనాట గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ ఆందోళనల్లో ఓ పోలీసు గాయపడ్డారు. దీనిపై స్పందించిన రజనీకాంత్‌ విధిలో ఉన్న పోలీసులపై దాడి చేయడం బాధాకరమని.. అలా చేసే వారికి శిక్షించాలని అన్నారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ బీజేపీకి కొమ్ముకాస్తున్నారని సినీ దర్శకుడు భారతీ రాజా విమర్శించారు. 
 
కావేరి బోర్డు ఏర్పాటు కోసం చేసిన ఆందోళనలు ఏవీ హింసాత్మకం కాదని, అనుకోకుండా కొన్ని అనూహ్య సంఘటనలు జరిగాయని భారతీరాజా అన్నారు. ఇదే రజనీ కాంత్ కర్ణాటకలో తమిళ లారీ డ్రైవర్‌పై దాడి చేసినప్పుడు ఎందుకు ఖండించలేదని అడిగారు. ఇక రజనీ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై స్వాగతించడం చూస్తుంటే ఆయన బీజేపీకి కొమ్ముకాస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించారు. తమది భవిష్యత్ తరాల కోసం చేసే పోరాటమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాస్టింగ్ కౌచ్‌పై పవన్ స్పందన.. ఇట్స్ ఓకే.. బట్ అసంతృప్తే: శ్రీరెడ్డి