Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి - మృతదేహంలో యానిమల్ వైరస్

pig heart
, శుక్రవారం, 6 మే 2022 (10:01 IST)
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఇది తొలుత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించారు. పిమ్మట మృతదేహానికి పరీక్షించగా మృతదేహంలో యానిమల్ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్సే ఆయన మరణానికి కారణమా కాదా అనే విషయాన్ని నిర్ధారించాల్సివుంది. 
 
ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 యేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు విజయవంతంగా పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కానీ, ఈ వ్యక్తి రెండు నెలలకే అంటే మార్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాన్‌గల్ యువకుడికి జాక్‌పాట్ - రూ.1.20 కోట్ల వార్షిక వేతనం