అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తావెందుకు అంటుంటాం. ఎందుకంటే ఎవరో మీద పోట్లాడుతూ... పక్కనే వున్నవారు అడ్డు వస్తే వారిపై చేయి చేసుకునే సందర్భాలు అక్కడక్కడ చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఓ వ్యక్తి అర్ధనగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ మేడపైన వున్నవారితో పోట్లాడుతూ ముందుకు వస్తున్నాడు. ఆ సమయంలో అతడి వెనుకగా ఓ కారు వచ్చింది. అతడిని చూసి కారు బ్రేకులు వేసి ఆపాడు. ఐతే రోడ్డుపై ఎవరిమీదో పోట్లాడే వ్యక్తి వెనక్కి తిరిగి కారు బానెట్ పైన చేత్తో గట్టిగా కొట్టాడు. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు యజమాని డోర్ తీసుకుని బైటకు వచ్చి కారును చేత్తో కొట్టిన వ్యక్తి ముఖంపై ఒకే ఒక్క పంచ్ ఇచ్చాడు. అంతే.. అతడు నేరుగా వెళ్లి గోడకు కరుచుకున్నాడు. చూడండి ఆ వీడియో...