Publish Date: Wed, 26 Feb 2020 (18:22 IST)
Updated Date: Wed, 26 Feb 2020 (18:26 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. కాగా రోడ్డును దాటుతూ రెండు లారీల మధ్య ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు.
అయితే ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రోడ్డుపై నుంచి లారీలను తొలగించారు. రెండు లారీలు ఢీకొన్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.