Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్డర్ చేసిన ఫుడ్‌కు డబ్బులు అడిగితే.. కస్టమర్లను పోలీస్ అలా వెళ్ళగొట్టాడు.. (వీడియో)

Advertiesment
hotel workers and customers owner
పోలీసులు డబ్బులిచ్చి ఫుడ్ తినడం అనేది అరుదు. కొందరు పోలీసులు ప్రజలను డబ్బులడుగుతూ ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా హోటల్‌లో ఫుడ్‌కు ఆర్డర్‌ చేసిన ఒక పోలీస్‌ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు ఓ పోలీస్. దీంతో ఆ హోటల్‌ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఒక హోటల్‌కు వచ్చిన ఎస్‌ఐ ఫుడ్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు హోటల్‌లో ఉన్న కస్టమర్లపై లాఠీతో కొట్టి బయటకు వెళ్లగొట్టాడు. ఈ క్రమంలో ఒక మహిళకు లాఠీ దెబ్బ తగలడంతో ఆమె ఏడ్చింది.
 
ఇదంతా హోటల్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా ఆ ఎస్‌ఐపై హోటల్‌ యజమాని సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు లంచాల కోసం తమను వేధించడంతోపాటు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం