Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

తెలంగాణ బీజేపీలోకి త్వరలో బాహుబలి? ఎవరబ్బా ఆ బాహుబలి?

Advertiesment
Baahubali
, మంగళవారం, 18 జూన్ 2019 (12:51 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు మాత్రమే గెలుచుకుని ఢీలాపడినా, పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా నాలుగు లోక్ సభ సీట్ల గెలుచుకుని అనూహ్యగా పుంజుకుంది. దీంతో సహజంగానే భారతీయ జనతాపర్టీ అగ్రనాయకత్వం ఫోకస్ అంతా తెలంగాణ మీదే పెట్టింది.
 
2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెరాసకు ప్రత్యామ్నయం తామేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కమలనాధులు. ఇప్పటికే తెలంగాణలో ఓ బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు బీజేపీ అగ్రనాయకత్వానికి టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచే చేరికలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నా తెలంగాణా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం త్వరలో బాహుబలి బీజేపీలో చేరతారని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మరింది. 
 
ఇంతకీ ఆబహుబలి ఎవరు.. అధికార పార్టీ నుంచి వలస వస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ నుంచి బాహుబలి వస్తారా అన్న అంశంపై క్లారిటీ రాలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ లోకి బాహుబలి వస్తాడూ... వస్తాడూ.... అని  జానారెడ్డి లాంటి నేతలు ప్రచారం చేసినా.. బాహుబలి వచ్చినా ఫలితం లేదని తేలిపోయింది. మరి భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లే బాహుబలి ఎవరో తెలియాల్సి ఉందన్న గుసుగుసలు వినపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హారతి కర్పూరమైన అనిల్ అంబానీ ఆస్తి.. బిలియనీర్ ‌నుంచి మిలియనీర్‌కు...