Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోరిన కోర్కెలు తీర్చేందుకు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన శ్రీవారు(video)

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడావీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి మేటిది కల్పవృక

Advertiesment
Tirumala Brahmotsavalu
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:12 IST)
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడావీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి మేటిది కల్పవృక్షం. కల్పవృక్షంపై కొలువు తీరిన వేంకటేశ్వరుడిని తమిళులు రాజమన్నార్ అవతారంగా కొనియాడతారు. భక్తులు కోరిన కోర్కెలను కల్పవృక్షం, కామధేనువు, చింతామణి తీరుస్తాయనది పురాణ ప్రాశస్త్యం.
 
తనను శరణు కోరిన భక్తుల కొర్కెలను తీరుస్తానని చెప్పడానికే శ్రీవారి ఉభయ దేవేరులతో కలసి కల్పవృక్షంపై దర్శనమిచ్చారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పికలు లేకపోవడం పూర్వజన్మ స్మరణ కలగడంతో పాటు కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి. కల్పవృక్షం సకల ఫలప్రదాయం, కావున తనను వేడుకున్నవారికి తానే అన్ని సమకూర్చుతాడని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు భక్తులకు తెలియజేస్తున్నారు. 
 
కల్పవృక్ష వాహనంలో పశువుల కాపరైన గోపాలకృష్ణుడి రూపంలో స్వామి వారిని అలంకరించారు. నిస్సంకల్ప స్థితికి నిష్కామ స్థితికి, నిశ్చింతా స్థితికి కల్పవృక్ష వాహన దర్శనం ద్వారానే ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందగలరు. ఈ వాహనంలో ఊరేగే స్వామి వారిని చూసేందుకు అశేష భక్తజనం మాడవీధుల్లో బారులు తీరారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..