Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన ఇంటికథలా జూనియర్ చిత్రం వుంటుంది, కిరీటీని ఆశీర్వదించండి : గాలి జనార్ధన్ రెడ్డి

Advertiesment
Shivaraj Kumar, Gali Janardhan Reddy, Srileela, Genelia, Rajani Korrapati

దేవీ

, సోమవారం, 14 జులై 2025 (09:53 IST)
Shivaraj Kumar, Gali Janardhan Reddy, Srileela, Genelia, Rajani Korrapati
జూనియర్ టీజర్, ట్రైలర్,పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు.  తను డాన్స్ లో సూపర్ సీనియర్ అనిపిస్తున్నారు. అలాగే శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జెనీలియా గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర పోషించారని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ అన్నారు.
 
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన జూనియర్‌ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ బెంగళూరులో నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. 
 
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ,  డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సూపర్ స్టార్. కిరీటికి ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి. కిరీటికి శ్రీలీలకి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పారు.
 
గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నేను సాయి కర్ణాటకలో ఒకే స్కూల్లో చదువుకున్నాం. వారాహి బ్యానర్ తో ఆయన దేశవ్యాప్తంగా చాలా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కిరీటి చిన్న వయసులో ఉన్నప్పుడే తనతో సినిమా చేస్తానని ఆయన చెప్పడం గొప్ప ఆశీర్వాదం. శ్రీలీల నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పునీత్ రాజ్ కుమార్ ఆశీస్సులు కిరీటిపై ఉన్నాయి. జేమ్స్ సినిమా సమయంలో కిరీటికి ఆయనతో సమయాన్ని గడిపే అదృష్టం దక్కింది. కిరీటికి చిన్నప్పటినుంచి యాక్టింగ్ డాన్సింగ్ అంటే ఇష్టం. తను ఒక పాషన్ తోనే ఈ పరిశ్రమలోకి వస్తున్నాడు. మన ఇంట్లో జరిగే కథలాగా ఉంటుంది. తప్పకుండా సినిమాని చూసి మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను'అన్నారు.  
 
జెనీలియా మాట్లాడుతూ, కన్నడలో నా లాస్ట్ సినిమా శివకుమార్ గారితో చేశాను. అది నాకు చాలా స్పెషల్ ఫిలిం .మళ్లీ జూనియర్ తో ప్రేక్షకులు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. కిరీటి వండర్ఫుల్ యాక్టర్. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. జూలై 18న సన్మాని థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణూ దేశాయ్‌కు సర్జరీ... ఆమెకు ఏమైందంటూ అభిమానుల్లో చర్చ!!