సినీ నటి రేణూ దేశాయ్‌కు చిన్నపాటి సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. "సర్జరీ తర్వాత నా క్యూటీతో కలిసి డిన్నర్‌కు వెళ్లాను" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ఇపుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రేణు దేశాయ్ సర్జరీ తర్వాత అన పేర్కొనడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, రేణూ దేశాయ్ తనకు ఏ సర్జరీ జరిగింది. ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నారో వంటి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు.
కాగా, పవన్ కళ్యాణ్‌తో 2012లో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్ చాలా కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. రవితేజ నటించిన "టైగర్ నాగేశ్వర రావు" చిత్రంతో ఆమె మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల రెండు సినిమాలకు సంతకం చేసినట్టు ఆమె స్వయంగా వెల్లడించారు.