టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం రాత్రి హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు. ఈ మూవీలో పెళ్లి అంటే ఇష్టం లేని యువతిగా రీతూ వర్మ కనిపించనుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్ కీలకపాత్రల్లో నటించారు.
ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 29న థియేటర్లలో విడుదల కానుంది. తొలుత దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా మూడు సినిమాలు పోటీకి దిగడంతో 'వరుడు కావలెను' యూనిట్ వెనక్కు తగ్గింది.
ఈ ట్రైలర్ ప్రారంభం 'పెళ్లి చూపులు కెఫేలోనా కొంచెం వివరంగా చెప్తారా' అంటూ ప్రవీణ్ సంభాషణలతో మొదలవుతుంది. కిరీటి దామరాజు అమ్మాయేది అని నదియాను అడుగుతుంటే.. అది రాదు బాబు తనకు పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు అంటూ చెప్తోంది.
పొగరుబోతులకు కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతీ సీజన్‌లో ఆవిడే విన్నర్ తెలుసా.. అంటూ వెన్నెల కిశోర్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచటం ఖాయమని తెలుస్తోంది. పెళ్లి చూపుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఫైనల్ ఎలా ఒక్కటయ్యారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది.