Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

Prabhutva Junior Kalasala trailer

డీవీ

, శనివారం, 15 జూన్ 2024 (19:24 IST)
Prabhutva Junior Kalasala trailer
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.

సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికేట్ అందుకున్న  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఇటీవల విడుదల చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ బాగుందంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ దక్కుతున్నాయి. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. టీనేజ్ లో అడుగుపెట్టిన వాసు (ప్రణవ్ ప్రీతం) స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. కాలేజ్ లో అడుగుపెట్టగానే అందమైన అమ్మాయి కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్)ని చూసి పడిపోతాడు. కుమారిని చూస్తేనే భయంతో వాసుకు మాటలు రావు. వాసు, కుమారి స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా దగ్గరవుతారు. కుమారి గురించి కాలేజ్ లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాసు వాడికి బుద్ధి చెబుతుంటాడు. ఇంతగా ప్రేమించిన వాసుతో మాట్లాడటం ఆపేస్తుంది కుమారి. వాసు ఎంత ప్రయత్నించినా కుమారి మనసు మారదు. వాసుకు కుమారి ఎందుకు దూరంగా ఉండాలనుకుంది ?. ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? అనే అంశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ ట్రైలర్ లో 'తనువు నాది కానీ, మనసు నీది కాదా..నిను చూడలేకుండా ఉండదే..నిదురనైన నిన్ను మరువదే.. ' పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందమైన పల్లెటూరి విజువల్స్, ‌ఫీల్ గుడ్ లవ్ ఎలిమెంట్స్, ఎమోషన్, మ్యూజిక్ వంటి అంశాలన్నీ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. 
 
ట్రైలర్ కు వస్తున్న మంచి రెస్పాన్స్ ఈ నెల 21న రిలీజవుతున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమాకు కూడా దక్కుతుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !