Kalki 2898AD Trailer poster
ప్రభాస్ తో వైజయంతిమూవీస్ నిర్మిస్తున్న కల్కి 2898 ఎడి ట్రైలర్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు విడుదల కాబోతుంది. హైదరాబాద్ లోని ట్రిబుల్ ఎ మల్టీప్లెక్స్ లో ఆర్భాటంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలపై బుజ్జి అనే కారు పై ప్రమోషన్ లు, ఆ తర్వాత కామిక్ లు విడుదలయ్యాయి. తాజాగా ట్రైలర్ ఎలా వుంటుందనే ఆసక్తి అభిమానులో నెలకొంది.
ఫ్యూచర్ అనేది ఎలా వుంటుందో తన సినిమాలో చూడొచ్చని సాంకేతికపరంగా అద్భుతంగా వుంటుందని ఇటీవలే ప్రభాస్ ప్రమోషన్ లో భాగంగా ప్రకటించారు. ఇతిహాసానికి టెక్నాలజీ జోడించి రెబల్ స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నమిది. దానితో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.
కాగా, ఇప్పటివరకు చేసిన ప్రమోషన్ పై పెద్దగా బజ్ రాలేదని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఈరోజు ట్రైలర్ తో నైనా భారీ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. దేశమంతా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ నటించడంవిశేషం. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ నటించాడని తెలుపుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ వ్యయంతో నిర్మించింది. ఈ జూన్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కి రాబోతుంది.