Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంతారా రేంజ్ లో నరకాసుర టీజర్ .. సినిమాటోగ్రాఫర్ సెంథిల్

Senthil, Rakshit, Charan Raj, and others
, సోమవారం, 1 మే 2023 (06:25 IST)
Senthil, Rakshit, Charan Raj, and others
సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నరకాసుర. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ విడుదల అయింది. నటుడు చరణ్ రాజ్ మాట్లాడుతూ .. మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గర్వంగా ఉంది. వైవిఎస్ చౌదరి నా అభిమాన దర్శకుడు. వారిని ఇక్కడ కలవడం సంతోషంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ సెబాస్టియన్ ను నమ్మి నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఏ సినిమాకు అయిన దర్శకుడే ఫైనల్. ఆయనకి సపోర్ట్ గా ఉండేది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. ఈ మూవీ కోసం అందరం చాల కష్టపడ్డాం. డిఫరెంట్ వెదర్స్ లో పని చేసాం. రక్షిత్ కు ఈ మూవీ పెద్ద బ్రేక్ ఇస్తుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో అద్భుతంగా నటించాడు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. నేను ఈ చిత్రం లో భాగం కావాలనే వెంటనే ఒపుకున్నాం. దర్శకుడికి ఒక సమస్య ఉన్నా.. దాన్ని దాటి మరీ గొప్పగా చేసారు. ఈ సినిమా అందరికి మంచి పేరు తెస్తుంది. తెలుగు సినిమాకు ఒక మైల్ స్టోన్ అవుతుంది అని చెప్పగలను.. అన్నారు 
 
అతిథి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ .. టీజర్ బావుంది. నేను పర్సనల్ గా సినిమాటోగ్రాఫర్ అయినందుకు ముఖ్యంగా తెలుగు సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది తెలుగు సినిమాకు గోల్డెన్ ఎరా అని చూపొచ్చు. బాహుబలినుంచి మొదలై ఇప్పుడు పాన్ ఇండియా ను కూడా దాటాం. నేను కూడా ఐతే అనే చిన్న సినిమాతోనే సినిమాటోగ్రాఫర్ గా ప్రయాణం మొదలుపెట్టాను. ఈ మూవీ టీజర్ చూన తర్వాత కాంతారా రేంజ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు కల్చరల్ బేస్ ఉన్నకథలకు మంచి ఆదరణ ఉంది. ఎవరినో మెప్పించాలి అని కాకుండా స్క్రిప్ట్ కు తగ్గట్టుగా పాత్రలూ, లొకేషన్స్ కరెక్ట్ గా ఎంచుకుని చేయాలి. ఈ మూవీ పెద్ద విజ్జయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.
 
నటుడు శ్రీమాన్ మాట్లాడుతూ .. ఈ వేదికపై ఉండటం చాల సంతోషంగా ఉంది. నేను ఎన్ని భాషలు మాట్లాడినా తెలుగు నా మాతృ భాష. ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చిన ముగ్గురికీ థాంక్స్ చెబుతున్నాను. ఏ సినిమాకు అయిన నిర్మాతే ఫైనల్. చాల ఏళ్ళ తర్వాత తెలుగులో చేసే అవకాశం వచ్చింది.  ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. డైరెక్టర్ కొత్త వాడైనా తాను అనుకున్నది వచ్చే వరకు ఎవరినీ వదల్లేదు. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా గొప్పగా డైరెక్ట్ చేసారు. తెలుగులో ఇతను పెద్ద దర్శకుడు అవుతాడు. మీ అందరికీ ఈ మూవీ ఫుల్ మీల్స్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది.. అంటూ ముగించారు.
 
దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ .. ఈ వైదికపై మీ అందరి ప్రెజన్స్ నాకు ఏంటో బలాన్ని ఇస్తోంది. సినిమా జరుగుతున్నప్పు ఇంత గొప్ప అవుట్ ఫుట్ వస్తుందని నేను ఎప్పుడు నమ్మలేదు. దీని కోసం ఏంటో బాధను భరించాము. త్యాగాలు చేసాం. బట్ ఈ రియాక్షన్ చూసాక అంటా మర్చిపోయాను. నేను జబల్ పూర్ లో సెటిల్ అయ్యాను స్క్రిప్ట్ కూడా అక్కడే రాసుకున్నాను. అక్కడే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసాం. నేను స్క్రిప్ట్ రాసుకున్నదంతా తీసే ప్రయత్నం చేశాను. మాక్సిమం నేను అనుకున్న ఫలితం వచ్చింది. ఈ జర్నీ మొత్తం లో ఆర్టిస్టుల సపోర్ట్ మరువలేను. హీరో రక్షిత్ సపోర్ట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. చాల టఫ్ గా ఉన్నా వాతావరణం లో పని చేసాడు. స్క్రిప్ట్ కు తగ్గట్టుగా రకరకాలుగా కనిపించేందు రెండున్నరేళ్ల పాటు ఎంతో కష్టపడ్డాడు. ఖచ్చింతంగా ఈ మూవీ తో సక్సెస్ అందుకుంటాం. ఈ సందర్బంగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ మరోసకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. అన్నారు .
 
హీరో రక్షిత్ మాట్లాడుతూ .. ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో పలాస టైం లో చూసాను. ఆ మూవీ తర్వాత గాప్  రావడం తో అందరూ హేళనగా మాట్లాడారు. బట్ ఈ టీజర్ వారికీ సమధానం చెబుతుంది. ఈ మూవీ కోసం రెండేళ్ల పాటు హీరోయిన్స్ కూడా కష్టపడ్డారు. ఇంతమంది సీనియర్ యాక్టర్స్ తో పని చేసే అవకాశం కల్పించిన దర్శకుడికి థాంక్స్ చెబుతున్నాను. మా డీవోపీ నాని గారు అద్భుతంగా చూపించారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం,. త్వరలోనే మరో పాటతో రాబోతున్నాం.. అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింధూ నాగరికతపై సినిమా తీస్తారా? రాజమౌళికి ఆనంద్ మహీంద్రా ప్రశ్న