Kalivi Vanam team at teaser relese function
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది.
ఈ సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో మీడియా మిత్రులు విడుదల చేశారు.
అనంతరం దుష్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ - పంచభూతాల్లాగే చెట్టు కూడా ప్రకృతి మాత. పంచభూతాలతో పాట ఆ చెట్టు తల్లి ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాలి. వనాలు బాగుంటే జనాలు బాగుంటారు. నాకు కూడా చెట్లంటే ఇష్టం. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం అన్యాయం. "కలివి వనం" చిత్రంతో పర్యావరణం గురించి మంచి సందేశం ఇచ్చారు. ఈ సినిమా మన సమాజానికి ఒక మార్గం వేయాలి, పర్యావరణ రక్షణ గురించి మన ప్రజల్లో ఆలోచన రేకెత్తించాలి. అన్నారు.
దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా. మనం వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే ఆకాశం నుంచి అని చెబుతాం. కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. అప్పుడే చెట్ల విలువ బాల్యం నుంచి పిల్లలు తెలుసుకుంటారు. ప్రేక్షకుల మనసులను తాకే చిత్రమిది. మీ హృదయాలకు చేరువవుతుంది. అలాంటప్పుడు మాది పూర్తిగా కమర్షియల్ చిత్రమే. నేను యూట్యూబ్ లో 300 పాటలు రూపొందించాను. దర్శకుడిగా ఇది నాకు మూడో సినిమా. మా కాసర్ల శ్యామ్ అన్నతో ఈ చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. నాగ దుర్గ ఫోక్ సాంగ్స్ చూడండి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఆమెను నా మూవీలో తీసుకున్నా. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవి గా మార్చిన దుష్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితోనే "కలివి వనం" చిత్రాన్ని రూపొందించాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె మాట్లాడుతూ - నేను కంపోజ్ చేసిన టీజర్ మాట్లాడుతుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేశానని భావిస్తున్నా. నేను రిక్వెస్ట్ చేయగానే పాట రాసిన కాసర్ల శ్యామ్ అన్నకు థ్యాంక్స్. అన్నారు.
నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ - సామాజిక స్పృహతో చేసిన సినిమా "కలివి వనం". బలగం చిత్రంతో నాకు ఎంత పేరొచ్చిందో ఈ చిత్రానికి కూడా అలాంటి గుర్తింపే వస్తుందని ఆశిస్తున్నా. సినిమాలో నటించేప్పుడు మా డైరెక్టర్ గారు తనకు కావాల్సిన ఔట్ పుట్ వచ్చేవరకు పనిచేయించారు. అడవుల్లో గుట్టల్లో షూటింగ్ చేశాం. అవన్నీ మంచి ఎక్సిపీరియన్స్ గా భావిస్తున్నాం. ప్రకృతి కోసం చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
లిరిక్ రైటర్ తిరుపతి మాట్ల మాట్లాడుతూ - డైరెక్టర్ రాజ్ అన్న ఎంతో కాలంగా యూట్యూబ్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. "కలివి వనం" సినిమాతో నేచర్ గురించి బిగ్ స్క్రీన్ మీద తన విజన్ చూపించబోతున్నారు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ చిత్రంలో మంచి సాహిత్యాన్ని అందించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ మాట్లాడుతూ - ప్రకృతిని కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ రాజ్ నరేంద్ర "కలివి వనం" చిత్రాన్ని చేయడం అభినందనీయం. ఎవరికి వీలైన మార్గాల్లో వారు మన నేచర్ ను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా అన్నారు.
నటుడు ఖయ్యూం మాట్లాడుతూ - డైరెక్టర్ రాజ్ నరేంద్ర మొదటి హీరోను నేనే. 12 ఏళ్లుగా మేము స్నేహితులుగా ఉన్నాం. "కలివి వనం" అనే సినిమాను రూపొందించడం రాజ్ కే సాధ్యం. యాక్షన్, లవ్, రొమాంటిక్ అంటూ చాలా జానర్స్ మూవీస్ చూస్తుంటాం. కానీ ఈ సినిమాను మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పగలను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని విష్ చేస్తున్నా. అన్నారు.
నిర్మాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ - దర్శకుడు రాజ్ లాగే నాకు కూడా చెట్లంటే ఇష్టం. అందుకే "కలివి వనం" సినిమాను రూపొందించాను. ఈ రోజు మా సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఒక చిన్న ఐడియాగా మొదలైన ఈ మూవీ ఈ రోజు ఇంత బాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం హ్యాపీగా ఉంది. అన్నారు.
నిర్మాత విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు మా "కలివి వనం" సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ల సపోర్ట్ తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ మా మూవీ టీమ్ తరుపున ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నారు.
నటి నాగ దుర్గ మాట్లాడుతూ - పర్యావరణం బాగుండాలని చెప్పే మంచి సందేశమున్న సినిమా "కలివి వనం". ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. అందుకు మా డైరెక్టర్ రాజ్ గారికి థ్యాంక్స్. అలాగే ప్రొడ్యూసర్స్ మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి లేకుంటే ఇలాంటి మూవీ నిర్మాణమయ్యేది కాదు. మా దర్శక నిర్మాతల వల్లే "కలివి వనం" మీ ముందుకు వస్తోంది. అన్నారు
నటి బలగం విజయలక్ష్మి మాట్లాడుతూ - వనాలను కాపాడుకోవాలి, జనాలను రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ తో డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నాకొక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించి చెట్లను కాపాడాలని కోరుతున్నా. అన్నారు.