Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకట్టుకునేలా కలశ మూవీ - రివ్యూ

Advertiesment
Kalasa
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (16:27 IST)
Kalasa
నటీనటులు.. అనురాగ్‌, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణి కామిశెట్టి, సమీర్, రవివర్మ తదితరులు
సాంకేతికత.. కెమెరా- వెంకట్ గంగధారి, సంగీతం- విజయ్ కురాకుల, నిర్మాత- రాజేశ్వరి చంద్రజ వాడపల్లి, దర్శకత్వం: కొండా రాంబాబు
 
కథ:
హారర్‌ సినిమాను తెరకెక్కించాలనుకుని తన్వి(భానుశ్రీ) కథను సిద్ధం చేసుకుని ఓ నిర్మాతను కలుస్తుంది. తను కథంతా విని ముగింపు మార్చమని అంటాడు. సరే అని బయటకు వచ్చి హైదరాబాద్‌లో ఉన్న తన స్నేహితురాలు కలశ (సోనాక్షి వర్మ) ఇంటికి వెళ్ళి కలవాలని తన్వీ వెళితే అక్కడ కలశ వుండదు. తన్వీ ఫోన్ చేస్తే, ఓ పనిమీద బయటకు వెళ్ళాననీ, లేట్ గా వస్తానని బదులిస్తుంది. సరే అని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటుంది.
 
ఇక అక్కడ నుంచి తాను రాసుకున్న కథలోని సన్నివేశాలు ఆ ఇంట్లో కనిపించడంతో షాక్ అవుతుంది. తన్వీకి కనపించడకుండా ఒకరు పరిశీలిస్తుంటే మరో వ్యక్తి కనిపించకుండా తిరగడంతో బహుశా  కలశ చెల్లి అన్షు (రోషిణి కామిశెట్టి) తనను ఆట పట్టిస్తుందని తన్వి భావిస్తుంది. కానీ ఆ తర్వాత రోజు తన్వీకి షాక్ న్యూస్ తెలుస్తుంది. కలశ, అంజు ఇద్దరూ చనిపోయారని, ఇప్పుడు ఎవరు ఉండట్లేదని ఆ ఇంటి పని మనిషి చెబుతాడు. ఇక ఆ తర్వాతఏం జరిగింది? మధ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోణి మానస హత్యకు సంబంధం ఏంటి? కలశ, అంజు ఎలా చనిపోయారు? అనేవి తెలియాటంటే సినిమా చూడాల్సిందే.
 
సమీక్ష:
ఇలాంటి హారర్‌ నేపథ్యంలో సినిమాలకు ఎంటర్ టైన్మెంట్ జోడించి రక్తికట్టించే పని చేస్తుంటారు. ఇందులోనూ రచ్చ రవి, భానుశ్రీల మధ్య వచ్చే కామెడీ సీన్‌ నవ్వులు తెప్పిస్తుంది. అయితే థ్రిల్లర్ సినిమాకు సస్పెన్స్ చాలా కీలకం. దాన్ని మరింత బాగా చూపిస్తే బాగుండేది. మొదటి భాగం సాధారణ కథ సాగుతుంది. నడిపించాడు. దానికితోడు కామెడీపై రన్ చేశాడు దర్శకుడు. అంతేకాకుండా ఎమోషన్స్ కూడా పండించాడు. కానిస్టేబుల్‌ నారాయణ, అతని కూతురు మానసల మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. ఇక దెయ్యం ఎపిసోడ్ కాస్త భయపెట్టినా కొంత రొటీన్ గా అనిపిస్తుంది.
 
మొదటి భాగం కూడా మరింత కేర్ తీసుకుని చేస్తే సినిమా మరింత ఆకట్టుకునేది. మొదటి భాగం సాదాగా తీసినా రెండో భాగంలో కథ ఆసక్తిగా మారుతుంది. ప్రధానంగా కలశ నేపథ్యం, అక్కాచెల్లెళ్ల చావులకు గల కారణాలు ఊహించని విధంగా ఉంటాయి. కార్తికేయ పరిశోధనలో  థ్రిల్లింగ్‌ ఉంటాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది.
 
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ మంచి పాత్ర చేసింది.  యువత దర్తశకురాలిగా తన్వి చక్కగా నటించింది. తెరపై  కావాల్సిన చోట అందాలను ఆరబోస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది.  సోనాక్షి వర్మ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. సెకండాఫ్‌తో తన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. అన్షుగా రోషిణి కామిశెట్టి, పోలీసు అధికారి కార్తికేయగా రవివర్మ, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న సీఐగా సమీర్‌, సినిమా రచయిత రాహుల్‌గా అనురాగ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
 
హార్రర్ సినిమాలకు సంగీతం, కెమెరా పనితం కీలకం. విజయ్‌ కురాకుల నేపథ్యం సంగీతం కొన్ని చోట్ల భయపెట్టిస్తుంది. వెంకట్‌ గంగధారి సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా ఫేమ్ తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ చక్కటి సినిమాను నిర్మించింది. తొలిసినిమాలో ఆమె తపన కనిపించింది. ఈ సినిమా ఆమెకు మరిన్ని సినిమాలు తీసేందుకు దోహదపడుతుంది. థ్రిల్లర్, హార్రర్ సినిమాలు వీక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. 
రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునీత కుమారుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి సిద్ధమైంది