Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరికొత్త కథతో భయపెట్టే చిత్రంగా పిండం - రివ్యూ

Advertiesment
Pindam poster
, శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:49 IST)
Pindam poster
హీరో  శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలయింది. గతంలో పలు హార్రర్ సినిమాలు వచ్చినా పిండం అనేది ఎలా తీశారో తెలుసుకుందాం.
 
కథ.
ఆత్మలపై రీసెర్ఛ్ చేసే లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్), ఆత్మలను వదిలించే వృత్తిగా పెట్టుకున్న అన్నమ్మ (ఈశ్వరీ రావు)ను ఇంటర్వూ చేసే క్రమంలో కథ జరుగుతుంది. 1990 లో శుక్లాపేట అనే ఊరిలో ఆంథోని (శ్రీరామ్) రైస్ మిల్లులో అకౌంటెంట్. ఆయనకు భార్య మేరి (ఖుషి రవి), సోషియా, తార అనే కూతుళ్ళు. అందులో తార మూగది. పక్క ఊరిలో తన బడ్జెట్ కు తగినంతలో ఇల్లు వుందని తెలిసి పాతకాలపు ఇల్లును కొనుగో చేస్తాడు. అనంతరం తన కుటుంబంతోపాటు తన అమ్మను కూడా ఇంటికి తీసుకు వస్తాడు.
 
ఇక ఆ ఇంటికి వచ్చాక చిన్న పిల్ల తార చిత్రంగా ప్రవర్తించడంతోపాటు పలు సంఘటనలు జరుగుతాయి. మొదట్లో తేలిగ్గా తీసుకున్నా ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో ఈ ఇంటిలో ఆత్మలున్నాయని డిసైడ్ అయిపోతారు.  ఆతర్వాత ఇటువంటి ఆత్మలను ఛేదించే అన్నమ్మ వుందని తెలిసి ఆంథోని కలుస్తాడు. కానీ ఈ ఇంటిలో ఒక ఆత్మ కాదనీ, పలు ఆత్మలున్నాయని అన్నమ్మ చెప్పడంతో తాను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానంటాడు. అది కుదరదనీ, మిమ్మల్ని ఆత్మలు వెళ్ళనివ్వవనీ అన్నమ్మ తేల్చి చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆంథోని కుటుంబం పరిస్థితి ఏమిటి? అన్నమ్మ ఏం చేసింది? అనేది మిగిలిన కథ.
 
సమీక్ష
హార్రర్ అంటూ భయపెట్టే సినిమాలుగా తీసినా ఎక్కువగా కామెడీ జోడించి ప్రేమ కథాచిత్రమ్, త్రిపుర తరహా సినిమాలు వచ్చాయి. కానీ పూర్తిగా భయపెట్టేవిధంగా సినిమా తీశాడు దర్శకుడు సాయికిరణ్ దైదా. ఇందులో 1920 , 1990 , వర్తమాన కాలంను ఎంచుకున్నాడు. హాలీవుడ్ హార్రర్ సినిమాల తరహాలో సీరియస్ గా వుంటూ,  మన నేటివిటికీ తగివిధంగా పాత్రలను డిజైన్ చేశాడు.
 
పాత్రలకు తగిన విధంగా సగటు మనిషిగా శ్రీరామ్ పాత్ర ఆకట్టుకుంటుంది. తన అమ్మ కొడుకు కావాలని పోరు చేసే విధంగా చేసిన పాత్ర సహజంగా వుంటుంది. ఇంటిలో ఆడపిల్లలు కంటే  ఒక్క మగ పిల్లాడు వుంటే చాలు అన్న విధంగా సెంటిమెంట్ బలంగా వున్న రోజులివి. అలాంటి ఆలోచనలు వున్న 1920 కాలం నుంచి నేటివరకు ఏ మాత్రం మారలేదని మరోసారి చూపించాడు దర్శకుడు. ఇది సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. 
 
అయితే ఆత్మలు వచ్చే టైంలో సన్నివేశాలు కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. కొన్ని రొటీన్ గా వున్నా ట్రీట్ మెంట్ సరికొత్తగా చేసే ప్రయత్నం చేశాడు. సహజంగా దెయ్యాలు, భూతాలు వున్న సినిమాలలో విరుగుడుగా మసీదుకు వెళ్ళి ప్రయత్నాలు చేయడం, హిందువులయితే తంత్ర పూజలు చేయడం చూశాం. ఇందులో హిందూ, క్రైస్తవులు, ముస్లింలు ముగ్గురు కలిసి ఇలాంటి ఆత్మలను పారద్రోలో క్రమాన్ని అన్నమ్మ తన తండ్రి నుంచి నేర్చుకుని ప్రయోగం చేయడం కొత్తగా వుంది.
 
చిన్నపాటి లోపాలున్నా సెకండాఫ్ లో ఎక్కువగా అన్నమ్మ చేసే ట్రీమ్ మెంట్ నిడివి ఎక్కువ కావడంతో ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండాఫ్ లో భయపెట్టేవిధంగా ట్రీమ్ మెంట్ తో ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాకు సంగీతం కీలకం. సైరభ్ తన రీరికార్డింగ్, బీజిఎం.తో హైలైట్ చేశాడు. దానికి కెమెరాపనితనం కూడా తోడయింది. అయితే ఇలాంటి సినిమాలకు సౌండ్ అంత ఎక్కువ కాకపోయినా హాలీవుడ్ సినిమాల తరహాలో మధ్యస్తంగా వుంటే బాగుండేది. సైండ్ ఎక్కువ వల్ల పాటకానీ, ఆర్టిస్టుల డైలాగ్ లు కానీ స్పష్టంగా వినిపించకుండా పోతుంది.
 
పిండం అనే టైటిల్ కు జస్టిఫికేషన్ కూడా సరిపోయింది. హార్రర్ సినిమా కథలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయి. అందుకు సీరియస్ కథగా దీనిని దర్శక నిర్మాతలు తీశారు. పిల్లలను కూడా అలరిస్తుంది. ఎంత మేరకు విజయస్థాయి పెరుగుతుందనేవి ప్రేక్షకుల ఆదరణ బట్టి తెలుస్తుంది.
రేటింగ్ - 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలిపిరి మెట్లెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె