Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ విత్‌ హర్రర్‌ కథగా కలశ చిత్రం

murali mohan with kalasa team
, బుధవారం, 13 డిశెంబరు 2023 (17:48 IST)
murali mohan with kalasa team
బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో  ‘‘ఓ చిట్టీ తల్లి’’ సాంగ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్‌ నటులు మురళీమోహన్‌ ఆవిష్కరించారు. కలశ టైటిల్సాంగ్ ను దర్శకులు వీర శంకర్‌ విడుదల చేశారు. 
 
అనంతరం మురళీ మోహన్‌ మాట్లాడుతూ, ఈ చిత్ర దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో నేను కొన్ని సీరియల్స్‌ చేశాను. మంచి పర్‌ఫెక్షనిస్ట్‌. దాసరి నారాయణరావు గారు అసిస్టెంట్‌ డైరెక్టర్‌లకు సీన్‌లకు సంబంధించిన వివరాలు డైలాగ్‌లు చెపుతుంటే టేపు రికార్డర్‌లో రికార్డు చేసుకునేవారు. ఆ తర్వాత వాటిని నీట్‌ రాసుకొస్తే.. చిత్రీకరణ సమయంలో వాటిలో కొన్ని డైలాగ్‌లు కొట్టేసేవారు. ఎందుకంటే అవి ఈ సీన్‌కు అంత అవసరం లేదు అనేవారు. అలాగే ఈ రాంబాబు కూడా మంచి రచయిత. ఏది కావాలో అదే తీస్తాడు. తద్వారా నిర్మాతకు లాభం. ఈ సినిమా గురించి విన్నాను. మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌. థ్రిల్లర్‌ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్‌ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్‌ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా అన్నారు. 
 
దర్శకులు వీరశంకర్‌ మాట్లాడుతూ, ఈ ‘‘చిట్టితల్లి’’ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇలాంటి సైలకాజికల్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలంటే కత్తిమీద సాము లాంటింది. నిర్మాత సహకారం చాలా ముఖ్యం. లక్కీగా దర్శకుడు రాంబాబుకు సినిమాల మీద మంచి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు చంద్రజగారు, స్వామి గారు దొరికారు. చాలా మంది కొత్తవారు సినిమా తీశామంటే తీశాం అన్నట్లుగా ఉంటారు. కానీ ఈ నిర్మాతలు మాత్రం పక్కాగా అన్నీ తెలుసుకుని ప్రొఫెషనల్‌గా ప్రొడక్షన్‌లోకి దిగారు. అందుకే ఇంత మంచి విజువల్‌ వండర్‌ను రూపొందించగలిగారు. యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు. 
 
నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ,  ఇప్పటి వరకూ భారతీయ వెండితెరమీద ఇలాంటి డెఫరెంట్‌ పాయింట్‌తో ఏ సినిమా రాలేదు అని గర్వంగా చెప్పగలను. ‘కలశ’ అనే మంచి పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో కూడిన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ విత్‌ హర్రర్‌ కథను ప్రేక్షకులకు సాదా సీదా టెక్నీషియన్స్‌తో చెపితే సరిపోదు అనిపించింది. ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న నేను ప్రొడక్షన్‌ చేస్తున్నాను అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. వాటిని ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నా. ఓ ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించా. ప్రేక్షకులందరికీ మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే చిత్రం అవుతుంది. ఈనెల 15న థియేటర్స్‌లో విడుదలౌతున్న మా చిత్రాన్ని ఆదరించవలసిందిగా ప్రేక్షకులను కోరుతున్నాం అన్నారు. 
 
చిత్ర దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ, ఈ సబ్జెక్ట్‌కు ఇంత మంచి టెక్నీషియన్స్‌ను, ఆర్టిస్ట్‌లను ఇవ్వడమే కాకుండా బడ్జెట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. చంద్రజగారి వంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ దొరకబట్టే ‘కలశ’ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆమె కాకుండా మరొకరు అయితే ఈ సినిమాకు ఇంత న్యాయం జరిగి ఉండేది కాదేమో. థ్రిల్లర్‌ కథలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కెమెరా చాలా కీలకం. ఈ విషయంలో మా సంగీత దర్శకుడు విజయ్‌ కురాకుల, డీఓపీ వెంకట్‌ గంగధారి గార్లు అద్భుతమైన పనితనం చూపించారు. సినిమా ఇంత బాగా రావటానికి కారకులైన యూనిట్‌ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శేఖర్ మాస్టర్ భరతనాట్యం నుంచి డుగు డుగు సాంగ్