Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శేఖర్ మాస్టర్ భరతనాట్యం నుంచి డుగు డుగు సాంగ్

Advertiesment
Bharatanatyam, dumdum song
, బుధవారం, 13 డిశెంబరు 2023 (17:39 IST)
Bharatanatyam, dumdum song
దొరసాని ఫేమ్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్య తేజ ఏలే హీరోగా పరిచయం అవుతున్న యూనిక్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'భరతనాట్యం'. 'సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్'అనేది క్యాప్షన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి 'డుగు డుగు' పాటని లాంచ్ చేశారు.
 
స్టార్ కంపోజర్ వివేక్ సాగర్ ఈ పాట కోసం మాస్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. క్యాచి ట్యూన్, ఎనర్జిటిక్ బీట్స్ తో స్వరపరిచిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలుస్తోంది. సినిమా, నిజ జీవితాన్ని పోలుస్తూ కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్ మాస్ ని ఆకట్టుకునేలా వున్నాయి. స్టార్ సింగర్ మంగ్లీ హైపిచ్ వోకల్స్ తో ఈ పాటకు మరింత ఎనర్జీ తీసుకొచ్చారు. శేఖర్ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేసిన మాస్ డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. విజువల్స్, సెట్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి.
 
పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవితేజ గిరిజాల ఈ చిత్రానికి ఎడిటర్.
 
త్వరలోనే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
నటీనటులు: సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ పై అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన వ్యక్తి అరెస్ట్. కఠిన చర్యలు తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు