Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

Advertiesment
The Legend of Prince Rama

డీవీ

, శుక్రవారం, 24 జనవరి 2025 (16:00 IST)
The Legend of Prince Rama
భారతరామాయణం గురించి తెలియనివారు లేరు. కానీ విదేశాల్లోనూ రామాయణ గాథలను బేస్ చేసుకుని సినిమాలు తీయడం విశేషమే. అలాంటిది మూడు దశాబ్దాల క్రితం జపనీస్ భాషలో తీసిన సినిమా నేడు తెలుగులో విడుదలైంది. అది కూడా యానిమేషన్ చిత్రం కావడం విశేషం. వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకుని జపాన్ కు చెందిన కోయిచి ససకి, యుగో సాకి తోపాటు భారతదేశానికి చెందిన రామ్ మోహన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కాగా, 31 సంవత్సరాల క్రితమే జపాన్ లో విడుదలయి కొన్ని కారణాలవల్ల భారతదేశంలో విడుదల కాలేదు. అయితే ఇప్పుడు గీక్ పిక్చర్స్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏ ఏ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ భాషలలో భారతదేశంలో జనవరి 24న విడుదల చేశారు. ఎలా తీశారో చూద్దాం.
 
కథ: 
 శ్రీరాముడికి 15 సంవత్సరాల వయసు నుండి మొదలు పెట్టి రామ రావణుల యుద్ధం తరువాత పట్టాభిషేకం వరకు జరిగిన విషయాలు చూపించారు. శ్రీరాముడు శివధనస్సును విరచడం, సీతను పెళ్లి చేసుకోవడం, అమ్మ కైకేయి కి ఇచ్చిన మాట ప్రకారం తండ్రి దశరథుడి మాట కోసమే 14 ఏళ్ళ అరణ్యవాసం పయనం, సీత, లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్లడం, దశరథ మహారాజు మరణించడం, భరతుడు రాముడు కోసం అడవికి వెళ్లడం, లక్ష్మణుడు సూర్పనక ముక్కు కోయడం, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, సుగ్రీవ వానర సైన్యంతో కలిసి రాముడు అప్పటికే సీత లంకలో హనుమంతుడు ద్వారా తెలుసుకుని హనుమంతుడు లంక దహనం తర్వాత లంకపై యుద్ధానికి వెళ్లడం, రామ రావణ యుద్ధం ఆ తర్వాత అయోధ్యకు తిరిగి రావడం వరకు కథనం వుంది.
 
సమీక్ష:
వాల్మీకి రామాయణం ఆధారం చేసుకుని వందల రామాయణాలు రూపొందాయి. యానిమేషన్ లోనూ డిస్నీవారు చేశారు. కానీ జపాన్ లో చేయడం విశేషమే. అందుకు సాంకేతికరపమైన వనరులు బాగా వున్న దేశంలో చేయడం మరింత క్రేజ్ వచ్చింది. రమారమి 1993లో ఈ చిత్రం రూపొందించారు. అయితే ఆ రోజుల్లోనే యానిమే గ్రాఫిక్స్ చేయడం గొప్ప విశేషమే. గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా నిజమైన రూపొందించడం ఎంతో కష్టమైనప్పటికీ చాలా బాగా తీయడం జరిగింది. అయితే నిర్మాణ విలువలలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం స్క్రీన్ లకు అలాగే ప్రేక్షకులకు తగ్గట్లు 4Kలో విడుదల చేయడం మరో విశేషం. 
 
మనకు బాలరామాయణం తెలుసు. కానీ అందులో అందరూ బాలలేఅయినా ఆకాశానికి నిచ్చెనపై వెళ్ళడం ప్రత్యేకత సంతరించుకుంది. అయితే జపాన్ రామాయణంలో అటువంటివి లేకపోయినా యానిమేషన్ పరంగా పిల్లలు ఇష్టంగా చూసే విధంగా వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని యాక్షన్ మూవీ జాట్ డేట్ ఫిక్స్