Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

Advertiesment
Ramayana: The Legend of Prince

డీవీ

, శనివారం, 11 జనవరి 2025 (15:29 IST)
Ramayana: The Legend of Prince
రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా (కార్టూన్) ట్రైలర్ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. భారత దేశం లో రామాయణ కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాల్మీకీ రామాయణం గురించి అనేక సినిమాలు వచ్చినా, ఇది ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.
 
నేడు విడుదలైన ట్రైలర్ లో, విజువల్స్ చాలా బాగున్నాయి. యుద్ధం సన్నివేశాలు చూస్తే, ఆ రోజుల్లో అయోధ్య లో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రైలర్ లో చూపించిన అయోధ్య, మిథిలా నగరాలూ, పంచవటి అడవి ప్రాంతం, సీతారాములు అరణ్యవాసం చేసిన ప్రదేశాలు మొదలగునవి అన్నీ సహజంగా ఉన్నాయి. జపనీస్ యానిమే స్టైల్ లో ఈ ట్రైలర్ ని రూపొందించడం జరిగింది.
 
యుగో సాకో, కోయిచి ససకి మరియు రామ్ మోహన్ లు అందరూ కలిసి ఈ సినిమా ని మన ముందుకు తీసుకొస్తున్నారు. దాదాపుగా 450 ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని రూపొందించారు.
 
"ఈ సినిమా భారత దేశం లోని గొప్ప కథ ని ట్రిబ్యూట్ లాగా భావిస్తున్నాం." అని మోక్ష మోడిగిలి తెలిపారు.
 
ఈ సినిమా కి నిర్మాత గా పని చేసిన అర్జున్ అగర్వాల్, "ఇండియన్ హెరిటేజ్ ని గొప్ప గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా ఈ రామాయణం సినిమా ని రూపొందించాం. కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమా ని అందరూ ఎంజాయ్ చేస్తారు." అని చెప్పాడు.
 
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ, "ఈ రాయణం కథ ఎంతో మంది భారతీయుల్ని కదిలించింది .  కచ్చితంగా ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా ని చేసాం." అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్