Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీనుల విందైనా స‌రే మెప్పించ‌లేక‌పోయిన జై భజరంగి

Advertiesment
వీనుల విందైనా స‌రే మెప్పించ‌లేక‌పోయిన జై భజరంగి
, శుక్రవారం, 29 అక్టోబరు 2021 (17:52 IST)
Dr. Shivaraj Kumar
నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే తదితరులు
 
సాంకేతిక‌తః  కెమెరాః స్వామి జె. గౌడ, ఎడిటర్: దీపు యస్ కుమార్, సంగీత దర్శకుడు: అర్జున్ జన్య, నిర్మాత: నిరంజన్ పన్సారి, దర్శకుడు: ఏ. హర్ష.
విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021
 
కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ హీరోగా న‌టించిన సినిమా భజరంగి ఈరోజే తెలుగులో విడుద‌లైంది. 2013లో క‌న్న‌డ‌లో వచ్చిన ‘భజరంగి’కి  సీక్వెల్ ఇది. క‌న్న‌డలో నిరంజన్‌ పన్సారి నిర్మించిన ఈ సినిమాను తెలుగులో బాలాజీ ఫిలిమ్స్ రాము విడుద‌ల చేశారు. క‌ల్పిత క‌థ‌తో అద్భుత గ్రాఫిక్స్‌తో ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై క్రేజ్ ఏర్ప‌డింది. శుక్ర‌వార‌మే  విడుద‌లైంది. కానీ ఇదే రోజు శివ‌రాజ్ సోద‌రుడు పునీత్ అకాల మ‌ర‌ణం కూడా వారి కుటుంబంలో విషాదానికి గురిచేసింది. ఇక ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ :
అదో అట‌వీ ప్రాంతం. కొంద‌రు న‌డుచుకుంటూ వ‌చ్చి సేద‌తీర‌డానికి ఓ గుహ‌కు వ‌స్తారు. అక్క‌డ దేవుడు వున్నాడంటూ ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో ఆ దేవుడు ఎవ‌రు? అని వారంతా అడ‌గ‌డంతో క‌థ మొద‌లవుతుంది. ఆ ఊరికి అంజి  ( శివరాజ్‌ కుమార్‌) వ‌స్తాడు. ఊరిలో వ‌డ్డీ వ్యాపారం చేస్తూ రౌడీరాణిలా వుండే త‌న అక్క‌య్య ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. పెళ్లి వయసు దాటిపోతున్నా ఇంకా పెళ్లి కాదు. అందుకే అక్క‌ అతనికి పెళ్లి చేస్తానని మాట ఇస్తోంది. మ‌రోవైపు అడ‌విలో ధన్వంతరి వంశానికి చెందిన వారసుల చేత సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఓషధులను ఉపయోగించి మ‌త్తుమందులు తయారుచేయిస్తూ డ‌బ్బు సంపాదిస్తుంటాడు ఓ అఘోరాలాంటి రాక్ష‌సుడు  ఓ సంద‌ర్భంలో వాడు ఊరిపై దాడిచేసి అక్క‌డి వారంద‌రినీ త‌న మ‌త్తు మందుల త‌యారీకి  బ‌ల‌వంతంగా బానిస‌లుగా మార్చుకుంటాడు. అందులో అంజి అక్క‌, ప్రేయ‌సి భావ‌న కూడా వుంటారు. ఎదురుతిరిగిన అంజిని అఘోరాలాంటి రాక్ష‌సుడు చంపేస్తాడు. కొన ఊపిరితో వున్న అంజి ఎలా బ‌తికాడు? ఆ త‌ర్వాత అత‌ను ఊరి వారికోసం ఏం చేశాడు? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేష‌ణః
తెలుగు వారికి శివ రాజ్ కుమార్ చిత్రాలు కొత్త‌నే చెప్పాలి. చాలా సంవ‌త్స‌రాల క్రితం ఒక‌టి అరా సినిమాలు ఇక్క‌డ‌కు వ‌చ్చేవి. అయితే ఇందులో వున్న విజువ‌ల్, డిఐ. వ‌ర్క్ చూస్తే మ‌రో కెజిఎఫ్‌. అనిపించేలా వుండ‌డంతో సినిమా ముందు క్రేజ్ ఏర్ప‌డింది. అందుకు త‌గిన‌ట్లు విజువ‌ల్ వండ‌ర్ కూడా వుంది. కానీ సినిమాటిక్‌గా క‌థ‌ను మార్చేయ‌డంతో ప్రేక్ష‌కుడు ఇన్‌వాల్వ్ కాలేక‌పోయాడు.
 
పుట్టించేది దేవుడు. చంపేది దేవుడు. మ‌న‌కు పుట్టించే శ‌క్తి లేన‌ప్పుడు బ‌లిపేరుతో నోరులేని ప‌శువుల‌ను బ‌లివ్వ‌డం ఏమిటి? అనే పాయింట్ చాలా సినిమాల్లో ఉన్న‌దే. ఇందులో హీరో చేత చెప్పిస్తాడు. అయితే మ‌నిసికి వ‌చ్చే రోగాల‌కు విరుగుడు భూమిలో వుంద‌నీ, కొన్ని మొక్క‌ల వ‌ల్లే అది సాధ్య‌మ‌ని, ధ‌న్వంత‌రి వాటిని చెప్పాడ‌నే పాయింట్ తెలిసిందే. ఆ కోణంలో జ‌రిగే క‌థ‌కు ధ‌న్వంత‌రి వార‌సులు, వారిని త‌న స్వార్థానికి వాడుకునే రాక్ష‌సుడు వంటి పాత్ర‌లు కొత్త‌గా అనిపిస్తాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాలు చాలా బాగున్నాయి కూడా.  
 
ఇది కేవ‌లం హీరో బేస్డ్ మూవీ. మ‌నుషులంతా స‌మాన‌మే వారి ఆరోగ్యం కోసం తెలిసిన విద్య‌ను అంద‌రికీ చెప్పాల‌నేది ఇందులో పాయింట్. హీరోకు భావ‌న‌కు వ‌చ్చే ల‌వ్ ఎపిసోడ్ కాసేపు ఆట‌విడుపు. ఇక మిగిలిన పాత్ర‌లు ఎవ‌రి పాత్ర‌కు వారు స‌రిపోయారు. 
 
సినిమాలో ధన్వంతరి వైద్య విధానానికి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోవు. కాస్త లాగ్ అనిపించేలా స‌న్నివేశాలు వుంటాయి. అంజి ధ‌న్వంత‌రి వార‌సుల‌కు, ఆ ్ర‌గామ ప్ర‌జ‌ల‌కు ఎలా దేవుడు? అయ్యాడ‌నేది సినిమా.  తెలుగు ప్రేక్ష‌కుల‌కు శివ‌రాజ్ కుమార్ కొత్త‌కాక‌పోయినా ఇప్ప‌టి తరానికి ఆయ‌న పెద్ద‌గా రుచించ‌డ‌నే చెప్పాలి. ఒక‌ర‌కంగా భారీ తారాగ‌ణంతో కూడిన సినిమాతోపాటు క‌థ కూడా భారీగానే వుంటుంది. దానికి ద‌ర్శ‌కుడు హ‌ర్ష స‌రైన న్యాయం చేకూర్చ‌లేద‌నే చెప్పాలి.  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాలను మాత్రం రాసుకోలేదు. ఇక స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ బాగుంది.  సంగీత దర్శకుడు అర్జున్ జ‌న్యా అందించిన నేపథ్య సంగీతం బాగున్నా పాటలు మాత్రం పూర్తిగా ఆకట్టుకోవు. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇది తెలుగువారిని ఏమాత్రం ఆక‌ట్టుకుంటుందో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊరి కోసం కళ్యాణ మండపం క‌ట్టించిన‌ నిర్మాత రామాంజనేయులు