Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

Advertiesment
Anushka Shetty in Ghaati

డీవీ

, శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (12:50 IST)
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల అయింది.
 
కథ:
ఒరిస్సా, ఆంధ్రా బోర్డర్లో కొండలు, కనుమలలో నివసించే గ్రామల ప్రజలు అక్కడ పండే గంజాయిని సరఫరాచేసే కూలీలు. వీరిని ఘాటీలు అని పిలుస్తారు. ఆ కోవకు చెందిన వాళ్లే అనుష్క(శీలావతి), విక్రం ప్రభు. ఘాటీ పనులు మానేసి బస్ కండక్టర్‌గా శీలావతి, లాబ్ అసిస్టెంట్‌గా విక్రం పనిచేస్తుంటారు.  కానీ అనుకోకుండా శీలావతి మనస్సు మార్చుకొని ఘాటీగా మారుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో విక్రమ్‌ను పోటీదారులు ఆమె కళ్ళముందే చంపేసి, ఆమెను వివస్త్రను చేస్తారు. అలా ఎందుకు చేశారు? ఆమె ఏమి చేసింది.. అసలు ఘాటీగా మళ్ళీ ఎందుకు వచ్చింది.. అనేదే సినిమా.
 
సమీక్ష.
గంజాయి.. డ్రగ్స్.. ఎర్రచందనం.. ఇలా ఎన్ని రూపాలైన పనిచేసే కూలీల శ్రమను దోచుకుని ఎదురు తిరిగితే చంపేయడం అనేది వ్యాపారస్తుల పాలసీ. కులానికి దెబ్బతిన్నవాడే నాయకుడు. ఇందులో అలా ఎదిగినదే శీలావతి. ఆమెకు ఎదురైన ఛాలెంజ్, పరిస్థితులు.. దర్శకుడు క్రిష్. రియలిస్టిక్‌గా నాచురల్ లొకేషన్లో తీశాడు. 
 
గంజాయిలో రకాలు, పండించడం, వ్యాపారం చేసే విధానం.. తయారీ విధానం స్టడీ చేసి తీశారు. ఈ క్రమంలో పోరాటాలు, హింస బాగానే ఉంది. బాలయ్య శూలంతో చంపి ఎగరేయడం తరహాలో శీలావతి సీన్ క్లైమాక్స్‌లో కనిపిస్తుంది.. ఇలా రకరాలుగా హీరోయిన్ బేస్డ్ సినిమా ఇది. 
ఇందులో రకరకాల పాత్రలు వచ్చి పోతుంటాయి. ఫైనల్‌గా కూలీలు తమ తరం ఎలాఉండాలనుకుంటారో చూపించారు. ఇక ఇలాంటి వాటికి పోలీస్, రాజకీయనాయకులు కూలీలను ముద్దాయిగా ఎలా చూపిస్తారో.. వాస్తవికంగా ఉంది.
 
ఇక.. కెమరా పనితనం బాగుంది. మ్యూజిక్ కథ ప్రకారం నేపథ్యం.. బీట్.. బాగుంది.. పాటలు బాగున్నాయి. క్రిష్. కూడా 2 పాటలు రాశాడు. అందులో ఓ సీన్లో కనిపిస్తాడు. డైలాగులు భాష బాగుంది. జెండాను చూడితే అణిగి ఉంటుంది. ఆ తాడు తీస్తే రెపరెపలాడుతుంది. అదే కూలి బతుకు అనే సందర్భంలో పెట్టారు. ఇలా పలు సన్నివేశాలు ఉన్నాయి. మొత్తంగా ఘాటీ బాగున్నా. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం ట్విస్టులు లేకపోవడమే. పుష్పలో అలాంటివి కనిపిస్తాయి. కానీ ఇది హీరోయిన్ కథ కనుక ఆ థ్రిల్ కలగదు. ఏది ఏమైనా సరికొత్త కథను క్రిష్ చూపించాడు. ఇది యావరేజ్ మూవీ.
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు