Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

Advertiesment
Racharika poster

డీవీ

, శనివారం, 1 ఫిబ్రవరి 2025 (08:03 IST)
Racharika poster
అప్పరారాణి ప్రధాన పాత్రలో వరుణ్ సందేశ్ మరో కీలక పాత్రలో రూపొందిన సినిమా రాచరికం. టైటిల్ లోనే రాచరిక వ్యవస్థ ఎలావుంటుంది అనేది దర్శకుడు చెప్పేశాడు. రిలీజ్ కుముందుప్రముఖులు టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు సురేష్ లంకపల్లి దర్శకుడు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్ లో విడుదలైంది. మరి సినిమాఎలా వుందో చూద్దాం.
 
కథ:
అది 1970 ప్రాంతంలో రాచకొండ అనే ఊరిలో సర్పంచ్ రాజారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్‌)కు వారసులు కోసం చూస్తుంటే వారసురాళ్ళు పుట్టడంతో ముగ్గురు చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చే శిశువు కూడా ఆడపిల్ల (అప్సరారాణి) పుట్టడం పుట్టిన వెంటనే రాజారెడ్డికి ఎం.ఎల్.ఎ. సీటు హైకమాండ్ ఇస్తున్నట్లు కబురు రావడంతో కాస్త ఊరటచెందిన తన కుమార్తెను బయటకురాకుండా ఇంటిలోనే ఉండమనేలా శాసిస్తాడు. అలా రాజకీయాల్లో ఒక్కోమెట్టు ఎక్కుతూ సి.ఎం. పదవిపై కన్నేస్తాడు.
 
ఇక అప్సరారాణి యుక్తవయస్సుకు వచ్చేసరికి ఊరిలో మార్పులు జరుగుతాయి. కాలేజీలో ఆర్.ఎస్.ఎఫ్. అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరూ సమానమే అంటూ నాయకుడు క్రాంతి పోరాటాలు చేస్తుంటే, ఇది సహించని అగ్రవర్ణాలకుచెందిన ఓ వ్యక్తి  క్రాంతిని చంపేలా ప్లాన్ చేస్తాడు. ఆ స్థానాన్ని కాలేజీ విద్యార్థి శివ టేకప్ చేసుకుంటాడు. అప్పుడే శివ, భార్గవి రెడ్డి (అప్సరారాణి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. వీళ్ల ప్రేమ విషయం తండ్రి రాజారెడ్డి తెలియజేయంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఈ ప్రేమ విషయం తెలిసిన తర్వాత రాచకొండలో హింసాత్మక పరిస్థితులు ఎదురవుతాయి. ఇంకోవైపు రాజారెడ్డికి కొడుకు వరుణ్ సందేశ్. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రాచకొండ రాజకీయాలు ఎటువంటి మలుపు తిరిగాయి అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
1970 కాలంనాటి భూస్వామి పాలన ఊరిలో నిమ్నజాతులను ఏవిధంగా చూసేవారనేది దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కాలేజీ వ్యవస్థ, స్టూడెంట్ ఆర్గనైజేషన్, నగ్జలైట్ పోరాటం, మరోవైపు ప్రేమికుల కథ మిళితం చేసి తెరకెక్కించాడు. వారసుడికోసం అగ్రవర్ణాల వారిలో అహంకారం ఎలావుంటుందో చూపించాడు. ఫస్టాఫ్ లో ప్రేమికుల కథ, మరోవైపు రాజకీయాల్లో ఆధిపత్య పోరు వంటివి కూడా టచ్ చేశాడు. నటీనటుల పరంగా అప్సరారాణిపాత్ర ట్విస్ట్ లతో కూడుకుంది. తెలుగులో ఆమెకు దక్కిన అరుదైన పాత్ర ఇది. ఇక వరున్ సందేశ్ సరికొత్త ఫార్మెట్ లో కనిపించాడు. విలనిజంకూడా చూపిస్తూ తనలోని నటుడిని ఆవిష్కరించారు. అయ్యంగార్ పాత్ర గురించి చెప్పాల్సింది లేదు. తను జీవించేశాడు. విజయ్ రామరాజు కూడా ఇందులో మెప్పించాడు.
 
సాంకేతికంగా చెప్పాల్సింది. సంగీతం, పాటలు. వెంగీ తన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటి కాలానికి చెందిన నేపథ్య సంగీతం అలరించింది. దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమే. టైటిల్ లో చెప్పినట్లే ఇది కొత్త కథేమీకాదు. రాచరికం వ్యవస్థ ఎలావుంటుంది అనేది మరోసారి చూపించే ప్రయత్నం చేశాడు. కథనంలో చిన్నపాటి లోపాలున్నా సన్నివేశాలు మరింత బలంగా వుండివుంటే ఈ సినిమా మరోలా వుండేది. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాను ఒక్కసారి గతంలోకి వెళ్ళిచూసి ఆనందించవచ్చు. 
రేటింగ్ : 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ