Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది: త్రినాథరావు నక్కిన

Varun Sandesh, Trinatha Rao Nakkina

డీవీ

, సోమవారం, 6 జనవరి 2025 (14:23 IST)
Varun Sandesh, Trinatha Rao Nakkina
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌ జానర్ తో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన రిలీజ్ చేశారు.
 
ఈ టీజర్ చూస్తుంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలా ఉంది. ఓ అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవ్వడం, ఆ హత్యను ఛేదించే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించబోతున్నారని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ మరియు ఆర్ఆర్ క్రైమ్, థ్రిల్లర్ జానర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.  ఈ టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. నాలుగు భాషల్లో ఈ టీజర్ అందుబాటులో ఉంది. 
 
 *ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ..* ‘కానిస్టేబుల్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. వరుణ్ సందేశ్ కానిస్టేబుల్‌గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వరుణ్ సందేశ్‌కు మరింత మంచి పేరు రావాలి. దర్శక, నిర్మాతలు ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు చేసి సక్సెస్ కొట్టాలి. త్వరలోనే ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
 *వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..* ‘మా టీజర్‌ను విడుదల చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నేను ఆయనతో చేసిన ప్రియతమా నీవచట కుశలమా అనే చిత్రం నాకు చాలా ఇష్టం. కానిస్టేబుల్ టీజర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ మూవీ టీజర్ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
 *దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ..* ‘మా మూవీ కానిస్టేబుల్ టీజర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా హీరో వరుణ్ సందేశ్, మా నిర్మాత బలగం జగదీష్ గారికి థాంక్స్’ అని అన్నారు.
 
 *నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..* ‘ ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. మా అమ్మ గారు చనిపోయిన రోజు ఇది. ఈ రోజునే మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా టీజర్‌ను రిలీజ్ చేసిన త్రినాథరావు నక్కిన గారికి థాంక్స్. మా హీరో వరుణ్ సందేశ్‌కు ఈ చిత్రం కమ్ బ్యాక్ అవుతుందని నా గట్టి నమ్మకం. మా సినిమా టీజర్‌ను చూసి అందరూ ఆదరించండి’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal: విశాల్‌కు ఏమైంది.. బక్కచిక్కిపోయాడు.. చేతులు వణికిపోతున్నాయ్..? (video)