Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 రోజుల్లో ప్రీమించడం ఎలా? ట్విట్టర్ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే?

Advertiesment
30 రోజుల్లో ప్రీమించడం ఎలా? ట్విట్టర్ రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే?
, శుక్రవారం, 29 జనవరి 2021 (12:18 IST)
30 Rojullo Preminchadam Ela
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రీమించడం ఎలా థియేటర్లలో విడుదలైంది. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్లు వచ్చాయి. ఒకానొక సమయంలో, మేకర్స్ ఈ చిత్రాన్ని 'OTT' లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అలాంటి సమయంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నుండి వచ్చిన 'నీలి నీలి ఆకాసం ’పాట అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ పాట హిట్‌గా మారింది, ఇది చిత్రనిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. 
 
ఇంకా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు. చివరగా, ఈ చిత్రం తెరపైకి వస్తుంది. ఒక సినిమాలో ప్రధాన పాత్ర యాంకర్ ప్రదీప్ కీలక పాత్ర పోషించాడు. ఎట్టకేలకు హీరోగా నటించాలనే తన కలను ప్రదీప్ నెరవేర్చుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగా నీట్‌గా సాగింది. మంచి పాటలు కామెడీతో డీసెంట్‌గా ఉన్నా కొన్ని కాలేజ్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. 
 
కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అలాగే ప్రదీప్ చాలా డీసెంట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. మరి సెకండాఫ్ ఎంత కీలకంగా మారింది. ఇంటర్వెల్ అనంతరం సినిమాలో అంశాలు అన్నీ మారిపోయాయి. ఓ కొత్త ట్విస్ట్‌తో లవ్ స్టోరీ, రోల్స్‌లో సరికొత్త మలుపు కనిపిస్తుంది. 
 
మొత్తానికి 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా రిలీజైంది. ఇందులో ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మున్నా వహించారు. నిర్మాత ఎస్ వి బాబు నిర్మించారు. అనూప్ రుబెన్స్ అందించారు. యాంకర్‌గా ప్రదీప్ హీరోగానూ నిరూపించుకున్నాడనే చెప్పాలి. 
 
అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉన్నప్పటికీ ఆ టార్గెట్‌ను ప్రదీప్ అందుకున్నాడనే చెప్పాలి. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.4కోట్లని తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో సినిమా 1.5కోట్ల ధర పలకడం విశేషం. ప్రదీప్ మొదటి సినిమా అయినప్పటికీ బిజినెస్ బాగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ.. హీరోయిన్‌గా వచ్చేస్తోంది..!