Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`వంగ‌వీటి` సెన్సార్ ఫూర్తి... డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ `వంగ‌వ

Advertiesment
`వంగ‌వీటి` సెన్సార్ ఫూర్తి... డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్
, శనివారం, 17 డిశెంబరు 2016 (17:24 IST)
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ `వంగ‌వీటి` సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 23న వంగ‌వీటి చిత్రం గ్రాండ్‌ రిలీజ్ అవుతుంది. 
 
సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి ఎంతో క్రేజ్ నెల‌కొన్నఈ సినిమా పాట‌ల‌కు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ ఫ్యాన్సీ రేటు చెల్లించి నైజాం హ‌క్కుల‌ను సొంతం చేసుకుని ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. 
 
డిసెంబ‌ర్ 20న `వంగ‌వీటి` సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున‌లు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్‌ 24న 'ఓం నమో వేంకటేశాయ' టీజర్‌