Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబర్‌ 24న 'ఓం నమో వేంకటేశాయ' టీజర్‌

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా

Advertiesment
డిసెంబర్‌ 24న 'ఓం నమో వేంకటేశాయ' టీజర్‌
, శనివారం, 17 డిశెంబరు 2016 (16:45 IST)
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. కాగా, 'ఓం నమో వెంకటేశాయ' మోషన్‌ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. 
 
డిసెంబర్‌ 24న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
 
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతికవర్గం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఖైదీ నం.150' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేనట్టే... 18న చిరంజీవి 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు'