మగాడంటేనే ఘాటుగా, కారంగా, మిర్చీలా ఉండాలి...
అసలు మగాడంటేనే ఘాటుగా, కారంగా, మిర్చీలా ఉండాలి గురువుగారూ... చెప్పాడు శిష్యుడు. నిజమే కానీ, ఎంత ఘాటుగా, కారంగా ఉన్న మిర్చీనయినా ఆడాళ్లు పచ్చడి చేయకుండా వదలరు నాయనా... నెత్తి తడుముతూ చెప్పాడు గురువు. 2. ఆ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలిసి కూడా పట్టుకోలేకపో
అసలు మగాడంటేనే ఘాటుగా, కారంగా, మిర్చీలా ఉండాలి గురువుగారూ... చెప్పాడు శిష్యుడు.
నిజమే కానీ, ఎంత ఘాటుగా, కారంగా ఉన్న మిర్చీనయినా ఆడాళ్లు పచ్చడి చేయకుండా వదలరు నాయనా... నెత్తి తడుముతూ చెప్పాడు గురువు.
2.
ఆ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలిసి కూడా పట్టుకోలేకపోయావా... ఎందుకూ అంటూ కోపంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్.
ఆ ఇంటి ముందు ఇతరులు లోనకి ప్రవేశించరాదనే బోర్డుంది.. వినయంగా బదులిచ్చాడు పోలీస్ వెంకటస్వామి.
3.
ఎప్పుడూ ఈసురోమని ఉండే నీ హాస్పిటల్ ఈమధ్య పేషెంట్లతో కళకళలాడుతుంది. ఏమిటి సంగతి అడిగాడు మిత్రుడు వీరలింగం.
పదిమంది అందమైన నర్సులను ఈ మధ్యనే అప్పాయింట్ చేసానోయ్.. నిజాయితీగా చెప్పాడు సోమలింగం.