Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''యాత్ర'' నుంచి 'సమరశంఖం' ఎమోషనల్ లిరికల్ సాంగ్ వచ్చేస్తోంది..

దివంగత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ యాత్ర. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షర్మిళ పాత్రలో భూమిక నటించ

Advertiesment
Yatra
, గురువారం, 30 ఆగస్టు 2018 (18:41 IST)
దివంగత వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌ యాత్ర. వైఎస్సార్‌ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు సమాచారం. 
 
వైకాపా చీఫ్ జగన్‌ పాత్రలో ఎవరు నటించనున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి నటిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మమ్ముట్టి తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. 
 
మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 90 శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకూ మమ్ముట్టి లుక్ మాత్రమే బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 7 గంటలకి ఈ యాత్ర సినిమా నుంచి 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల కానుంది. 
 
ఎమోషనల్‌గా సాగే ఈ లిరికల్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు పెంచాలనే ఉద్దేశంతో సినీ యూనిట్ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా స్పెషల్ పోస్టల్ ఇప్పటికే రిలీజైంది. పాదయాత్ర నేపథ్యంలో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసేందుకు సినీ యూనిట్ సిద్ధమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్... నీకు వెయ్యి కోట్లిస్తా... ప్లీజ్ ఆ పాత్రలో నటించవూ: బ్రతిమాలుతున్న అమీర్