Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హజ్ యాత్ర... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు... ఏంటవి?

2018 హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ క్యాంప్‌ల‌ను స్టేట్ హ‌జ్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, ఒంగోలు,

Advertiesment
hajj yatra 2018
, గురువారం, 12 జులై 2018 (19:02 IST)
2018 హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాల వారీగా వ్యాక్సినేషన్ క్యాంప్‌ల‌ను స్టేట్ హ‌జ్ క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, ఒంగోలు, క‌ర్నూల్‌, ఆత్మ‌కూర్‌, నంద్యాల‌, విశాఖ‌ప‌ట్నంల‌లో ప్ర‌త్యేక హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి హ‌జ్ యాత్రికుల‌కు వ్యాక్సిన్ ఇచ్చారు.
 
గురువారం నాడు రాజ‌మండ్రి, గుంటూరు ప‌ట్ట‌ణాల్లో వ్యాక్సిన్ క్యాంప్ ఏర్పాటు చేసి హ‌జ్ యాత్రికుల‌కు టీకాలు వేశారు. గుంటూరు హజ్ వ్యాక్సినేషన్ క్యాంప్‌ను ఎంఎల్‌సి, ప్ర‌భుత్వ విప్ జనాబ్ ఎం.ఎ. షరీఫ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాకు చెందిన హజ్ యాత్రికులు ఈ క్యాంప్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు.
 
సౌదీ ప్రభుత్వ సూచన మేరకు భారత ప్రభుత్వం ప్రతి హజ్ యాత్రికుడికి oral polio vaccination, Meningitis Vaccination, Influenza Vaccination ఇస్తుందని ఎమ్మెల్సీ ఎం.ఎ. షరీఫ్ చెప్పారు. సౌదీలోని మక్కాకు వెళ్ళినప్పుడు హాజీలు ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కోకుండా వుండాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.
 
లగేజ్ సంబంధించి 22 కేజీ + 22 కేజీల రెండు సూట్‌కేసులు + హ్యాడ్ లగేజ్ 10 కేజీలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయాన్ని హజ్ యాత్రికులు గమనించాలని ఎమ్మెల్సీ సూచించారు. ఇష్టానుసారంగా హ‌జ్ యాత్రికుడు బ్యాగేజ్ తీసుకువెళ్ళ‌డానికి ఎయిర్‌పోర్ట్‌లో అనుమ‌తించ‌రు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ల‌గేజ్ లేక‌పోతే ఎయిర్‌పోర్ట్‌లో మీ సామాను అనుమ‌తించ‌రు. విమానాల షెడ్యూల్ వచ్చిన తరువాత తమకు కేటాయించిన తేదీకి 24 గంటల ముందు హైదరాబాద్ లోని నాంపల్లి హజ్ హౌస్‌కు చేరుకోవాలి.
 
హైదరాబాద్ హజ్ హౌస్‌కు చేరుకున్న తరువాత ప్రతి హజ్ యాత్రికుడు పేపర్ వీసా మీద వున్న వివరాలు, పాస్‌పోర్ట్‌లో వున్న వివరాలతో సరిపోల్చుకొని చూసుకోవాలని ఎమ్మెల్సీ షరీఫ్ హజ్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి హజ్ యాత్రికుడు వ్యాక్సిన్ తీసుకోవడం, శిక్షణా తరగతుల్లో సూచించిన సలహాల మేరకు హజ్ విధి విధానాల్ని పాటించడం, తమకు తెలియని విషయాల్ని తెలుసుకోవాలని ఈ స‌మావేశంలో ప్ర‌సంగించిన వ‌క్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ స‌మావేశంలో హ‌జ్ క‌మిటీ ఛైర్మ‌న్ మోమిన్ అహ్మ‌ద్ హుస్సేన్‌, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ హిదాయ‌త్‌తో పాటు  గుంటూరు జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ జానీమూన్‌, ఎపి హ‌జ్ క‌మిటీ స‌భ్యులు హాజీ హ‌స‌న్ భాషా, జ‌డ్పీటిసి స‌భ్యులు ష‌రీఫ్‌, ప‌లువురు టిడిపి సీనియ‌ర్ లీడ‌ర్లు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివానుగ్రహం కోసం ఎనిమిది వ్రతాలు.. అవేంటో తెలుసా?