మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు ఓ మహిళా వీరాభిమాని సైకిల్‌పై వచ్చి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అదీ కూడా ఏకంగా సైకిల్‌పై హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెను చిరంజీవి ఆప్యాయంగా పలుకరించారు.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి చిరంజీవిని చూసేందుకు హైదరాబాద్‌కు సైకిల్‌పై వచ్చారు. 300 కిలోమీటర్లకు పైగా సైకిల్ తొక్కుతూ వచ్చి ఆయన్ను కలిశారు. మెగాస్టార్‌కి రాఖీ కట్టి మురిసిపోయారు. చిరు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆర్థికసాయం చేసి చీరను బహుకరించారు.
ఆమె పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాళ్లు ఎంత వరకూ చదువుకుంటే అంత వరకూ చదివిస్తానని భరోసానిచ్చారు. ఇది చూసిన వారంతా దటీజ్ మెగాస్టార్ అని కామెంట్స్ చేస్తున్నారు. అభిమానానికి హద్దులుండవని మరోసారి నిరూపించారంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, మన శంకరవరప్రసాద్‌గారుతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌గా ముస్తాబవుతోన్న విశ్వంభర వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మన శంకరవరప్రసాద్‌గారు 2026 సంక్రాంతికి సందడి చేయనుంది.