Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anil Ravipudi: ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది...

Advertiesment
Bhootham Preetham title and first look released by Anil Ravipudi

చిత్రాసేన్

, బుధవారం, 24 సెప్టెంబరు 2025 (17:26 IST)
Bhootham Preetham title and first look released by Anil Ravipudi
ఐదుగురు కుర్రాళ్లు భూతానికి, ప్రేతానికి చిక్కితే ఏమయింది? అనే పాయింట్ తో భూతం ప్రేతం చిత్రం రూపొందింది. యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్ బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు నటించారు. సృజన ప్రొడక్షన్స్ బ్యానర్ పై  బి. వెంకటేశ్వర రావు నిర్మించగా రాజేష్ ధృవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
 
అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘భూతం ప్రేతం’ ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాను. యాదమ్మ రాజు, భాస్కర్, నా టీం కోసం నేను లాంఛ్ చేశాను. టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
టైటిల్ చూస్తుంటే హారర్, కామెడీ అని అర్థం అవుతోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఐదుగురు కుర్రాళ్లు.. భూతానికి, ప్రేతానికి చిక్కినట్టుగానే కనిపిస్తోంది. ఆ భూతం నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథను నవ్విస్తూ, భయపెట్టేలా మలిచారని అర్థం అవుతోంది. ఈ ఏడాదిలోనే ‘భూతం ప్రేతం’ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఈ మూవీకి కెమెరామెన్ యోగేష్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ చంద్ర, మ్యూజిక్ గిరీష్ హోతుర్ అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో మేకర్లు ఆడియెన్స్ ముందుకు రానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sreeleela: మాస్ జాతర చిత్ర విడుదలతేదీని ప్రకటించిన నిర్మాత నాగ వంశీ