మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జతర చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతుంది. నేడు తన మాస్ జతర విడుదల తేదీని నిర్మాత నాగ వంశీ ఎట్టకేలకు వెల్లడించారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. మొదట ఆగస్టు 27, 2025న విడుదల కావాల్సి ఉండగా, ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు, శుభప్రదమైన దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2, 2025న విడుదల తేదీని ప్రకటిస్తామని నాగ వంశీ ధృవీకరించారు.
ఈ ప్రకటన తర్వాత వరుసగా అప్‌డేట్‌లు మరియు ప్రమోషన్‌లను కూడా ఆయన హామీ ఇచ్చారు. అభిమానులు విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ తోపాటలు కూడా మాస్ క్రేజ్ ను తెచ్చి పెట్టాయి. అయితే తింటా. పంటా అనే పదాలతో వచ్చిన పాటకు సినీ విశ్లేషకులనుంచి ఘాటు విమర్శలు వచ్చాయి. సాహిత్యకారులకూడా ఎంత మాస్ అయినా ఇలాంటి పదాలతో డాన్స్ లేమిటి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.