Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

Advertiesment
Ravi Teja, Srileela Jodi

దేవీ

, మంగళవారం, 5 ఆగస్టు 2025 (16:21 IST)
Ravi Teja, Srileela Jodi
రవితేజ కథానాయకుడిగా  75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి..  మొదటి గీతంగా విడుదలైన 'తు మేరా లవర్' అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా 'ఓలే ఓలే'ను విడుదల చేసింది చిత్ర బృందం. 
 
ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. 'ఓలే ఓలే' పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. 
 
సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో స్వరపరిచిన 'ఓలే ఓలే' మాస్ రాజా అభిమానులకు, మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంది. థియేటర్లలో ప్రేక్షకుల చేత.. ఈలలు, చప్పట్లతో స్టెప్పులు వేయించేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతం సాగింది. ఇక ప్రతిభావంతులైన రోహిణి సోరట్‌ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు. 
 
భాస్కర్ యాదవ్ దాసరి అందించిన సాహిత్యం ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంది. పాట యొక్క మూడ్‌కి సరిగ్గా సరిపోయే మాస్ ఫ్లేవర్‌తో ఆయన సాహిత్యం నిండి ఉంది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ చక్కగా కుదిరి.. 'ఓలే ఓలే'ను అదిరిపోయే మాస్ గీతంగా మలిచాయి. 
 
దర్శకుడు భాను బోగవరపు.. రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. పాటల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మాస్ రాజా వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో ఈ చిత్రంతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురాబోతున్నారు. 
 
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యతో కలిసి 'మాస్ జాతర' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
 
'మాస్ జాతర' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు , నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న