Jyoti Purvaj, Pawan Kalyan
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా కాదని మరో సినిమాకు థియేటర్లు ఇవ్వడం కొంచెం కష్టమైన విషయమే. కానీ మిరాయ్ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. తను తీసిన మిరాయ్ అద్భుతమైన కలెక్టన్లు రాబడుతుంది. ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీగా వున్నారు. కానీ పవన్ కళ్యాన్ కోసం రేపు విడుదలకానున్న ఓజీ కోసం కొన్ని థియేటర్లను మిరాయ్ తీసివేయనున్నారని టాక్ నెలకొంది. దానితోపాటు ఓవర్ సీస్ లోకూడా వదులుకుంటున్నాడని తెలుస్తుంది.
గురువారంనాడు అనగా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లలో విడుదలవుతుంది. అందుకోసం మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిసింది. 25, 26 తేదీల్లో మిరాయ్ ఆడుతున్న కొన్ని థియేటర్లలో సినిమాను వదులుకుని ఆ తర్వాత మరలా మిరాయ్ సినిమా వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త స్పెడ్ కాగానే పవన్ అబిమానులు సంతోషంగా నిర్మాతకు పవన్ అభిమానులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఇదిలా వుండగా, కిల్లర్ అనే సినిమాలో నాయికగా నటించిన జ్యోతి పూర్వజ్ తన సినిమా విడుదలను ఓజీ కోసం వాయిదా వేసుకుంది. తాజాగా ఆమె ఓజీ టీ షర్ట్ ధరించిన పవన్ అభిమానిగా సినిమా సక్సెస్ కావాలని ప్రచారం చేస్తోంది. కిల్లర్ సినిమాకు ఆమె నిర్మాత కూడా.