మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో అల్లు అరవింద్ పాత్ర చాలా కీలకం. చిరంజీవిపై ఈగ వాలనీయరు. తప్పొ ఒప్పో ఆయన తన బావ కనుక ఏదైనా చిరుని విమర్శిస్తే వాడిపని అంతేనట. చెన్నైలో వుండగా చిరంజీవి ఓ థియేర్‌లో సినిమా చూస్తుండగా పర్సనల్ మేనేజర్ (లేట్) ఫుల్ గా తాగి `ఏడి చిరంజీవి బయటకు రమ్మను అంటూ హార్ష్‌గా తిట్టడంతో అల్లు అరవింద్ వాడికి బుద్ధి చెప్పాడు. ఇవి అరవింద్ మనసులోని మాటలను ఇటీవలే అలీతో సరదాగాలో వ్యక్తం చేశారు. అలాగే పలు విషయాలను గురించి మాట్లాడారు.
చిరంజీవి నా బావ. సహజంగా ఇండ్లలో ఎలా పిలుచుకుంటారో అలానే పిలుస్తాను. కానీ రాజకీయాల్లోకి వచ్చాక. చిరంజీవిగారు అంటూ పిలవడం మొదలెట్టాను. ఆయన నన్ను రండి.. అరవింద్‌గారు అంటూ సంబోధిస్తారు. అలా కంటెన్యూగా అయిపోయింది.
నాకు గాళ్ ఫ్రెండ్ వుంది- అరవింద్
గీత ఆర్ట్స్ అనే పేరు తనకు గాళ్ ఫ్రెండ్ వుంది. అందుకే ఆ పేరు పెట్టారని అనుకుంటుంటారు. నాకు గీత అనే అనే అమ్మాయి తెలుసు. కానీ గీత ఆర్ట్స్ అనే బేనర్ నాన్నగారు అల్లు రామలింగయ్యగారు పేరు పెట్టారు. ఎలా అంటే, గీతలో చెప్పినట్లు పనిచేయడమే మన వంతు. ఫలితం ఆశించకు. ఇది నచ్చి నాన్నగారు అలా పేరుపెట్టారు. నిర్మాతగా డబ్బులు పెట్టు. సినిమా ఆడుతుందో, ఆడదో దేవుడికి వదిలేయ్ అనే సారాంశం. అందుకే అలా పెట్టారు.
రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ను కలపాలి
గీత ఆర్ట్స్ ఎన్నో సినిమాలు, ఎంతోమంది హీరోలతో చేసిన అరవింద్ మనసులో ఎప్పటినుంచో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ను కలపాలి ఉండేది. అందుకే వారిద్దరితో ఓ సినిమా తన బేనర్‌లో చేయాలని చరణ్, అర్జున్ టైటిల్ కూడా రిజిష్టర్ చేయించారు. అది ఇప్పటికీ రెన్యువల్ అవుతూనే వుంది. ఎప్పటికైనా వారిద్దరితో పాన్ వరల్డ్ సినిమా తీయాలని ప్లాన్ వుంది. కథ కోసం వెతుకుతున్నాం. ఎందుకంటే కరోనా తర్వాత కథలు మారిపోయాయి. అందుకే సరైన కథ కోసం కసరత్తు జరుగుతోంది. అవి అయ్యాక తప్పనిసరిగా వుంటుంది.
వచ్చే ఏడాదికి రామాయణం సినిమా
అదేవిధంగా రామాయణం కథను సినిమాగా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. నాతోపాటు మరికొతమంది కలిసి పాన్ వరల్డ్ సినిమా తీయాలని నిర్ణయించాం. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతా అయ్యేసరికి 2023 చివర్లో సెట్‌పైకి వెళుతుంది. వాటి వివరాలు త్వరలో చెబుతాను అని అరవింద్ తెలియజేశారు.