వామికగబ్బీ. ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇన్‌స్టాగ్రాం ఎక్కువగా చూసేవారికి ఈమె పరిచయం అక్కర్లేదు. తెలుగులో సుధీర్ బాబుతో భలే మంచి రోజు అనే సినిమాలో నటించింది. చాలా చలాకీగా ఉండే ఈ హీరోయిన్ ఈ మధ్య కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాం పెట్టడంతో అభిమానులు కామెంట్లు చేసేస్తున్నారు.
తెలుగు, హిందీ, మళయాళ చిత్రాల్లో నటించింది వామిక. 2013 సంవత్సరంలో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. అది కూడా హిందీ సినిమాతోనే ప్రారంభించింది. ఆ తరువాత మలయాళంలో రెండు సినిమాలు, తెలుగులో సుధీర్ బాబుతో సినిమా చేసింది. అయితే అందాన్ని ఆరబోయడంలో మాత్రం ఈమెకు ఈమే సాటి.
ఈ మధ్య వామిక చీరను కట్టుకుంది. చీరను కట్టుకుని సెక్సీగా ఫోటోలకు ఫోజిచ్చింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. చీర కడితే చూడాలనిపించాలి కానీ ఇలా చీర కట్టుకుని ఫోజులివ్వాలా అంటూ అభిమానులే తిడుతున్నారు. సినిమాల్లో అందాలను ఆరబోయి ఫోటో షూట్లో కాదంటూ అభిమానులు వామికను తిట్టేస్తున్నారు. అయినాసరే ఏమాత్రం వామిక వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఫోటోలను ఫేర్ చేస్తూనే ఉంది.