Publish Date: Sat, 16 May 2026 (12:32 IST)
Updated Date: Sat, 16 May 2026 (12:39 IST)
Naga Chaitanya, Meenakshi Chaudhary |
నాగ చైతన్య, కథానాయిక మీనాక్షి చౌదరి నటిస్తున్న చిత్రం వృషకర్మ. విరూపాక్ష.ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. బివిఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ రాజస్తాన్ లో జరుగుతోంది. నేడు వర్కింగ్ స్టిల్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రాజస్థాన్‌లోని అద్భుతమైన రాజప్రాసాదాల నడుమ ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది.
మరోవైపు సిజిఐ పనులు జరుగుతుండటంతో, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పౌరాణికాల్లోని ఓ అంశాన్ని తీసుకుని మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంకా షూటింగ్ లో వున్నందున ట్రైలర్ రోజు విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర టీమ్ పేర్కొంది. ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి బేనర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బాపినీడు సమర్పిస్తున్నారు.
తండేల్ సినిమా తర్వాత నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రమిది. దానికితో డు మీనాక్షి సక్సెస్ లో వుండడంతో వృషకర్మ సినిమాపై భారీ అంచనాలున్నాయి.నవీన్ నూలి ఎడిటిర్ గా వ్యవహరిస్తున్నారు.