Publish Date: Wed, 08 Apr 2026 (10:48 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (10:52 IST)
Akhil Akkineni's Birthday – Lenin Poster
అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే1వ తేదీన విడుదలచేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు డేట్ మార్చాం. జూన్ 26న విడుదల కానున్న 'లెనిన్' సినిమా అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ట్విట్టర్ లో తెలియజేసింది. నేడు అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విడుదల చేయడం విశేషం. అఖిల్ కు సినీరంగ ప్రముఖులు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రామ్ చరన్ నటించిన పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందని తెలియడంతో మేలో అఖిల్ సినిమా కూడా విడుదల చేసి పాజిటివ్ వేలో వెళ్ళాలనుకున్నాం. ఆ సమయంలో రామ్ చరణ్ కూడా అఖిల్ కు విషెస్ తెలుపుతూ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా తాము కూడా బెస్ట్ విషెస్ చెప్పాం. అయితే అప్పట్లో వాయిదా వేసిన లెనిన్ విడుదలను ఇప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నామని అన్నపూర్ణ స్టూడియోస్ తెలియజేసింది.
అభిమానులు, అన్నపూర్ణ స్టూడియోస్, మరియు 'లెనిన్' చిత్ర బృందం #HBDAkhilAkkineni వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి నటుడు అఖిల్ అక్కినేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలు పోస్టులు జూన్ 26న విడుదల కానున్న తెలుగు చిత్రం 'లెనిన్'ను హైలైట్ చేస్తూ, భాగ్యశ్రీ బోర్సే, నాగార్జున, వంశీ, తమన్ వంటి కీలక సిబ్బందిని ట్యాగ్ చేశాయి. ఇవి పుట్టినరోజు వేడుకలతో పాటు సినిమా ప్రమోషనల్ ప్రకటనల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి.