Sunil setty, mohanbabu, vishnu
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మోసగాళ్ళు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబుతో పాటు చీఫ్ గెస్ట్ రానా దగ్గుబాటి, డైరెక్టర్ రానా, శ్రీనువైట్ల, సునీల్ శెట్టి, రాజారవీంద్ర, డైమండ్ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, గాయని కోమలిని మోహన్ బాబు సత్కరించారు. మోసగాళ్లు బిగ్ టికెట్‌ను రానా లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ..జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మోసపోతారు. నా భార్య కూడా నన్ను పెళ్లి చేసుకుని మోసపోయాను అంది. ఎవరు ఎవరిని మోసం చేశారు నాకు అర్థం కాలేదు. మోసగాళ్లు మూవీ కథ అత్యద్భుతమైన కథ. యూత్ తప్పక చూడాల్సిన చిత్రం ఇది. కంప్యూటర్ టెక్నాలజీతో ఎలా మోసం చేశారు అనేది చాలాబాగా చూపించారు. అక్కాతమ్ముడు సీన్స్ చూసి నాకు కళ్లలో నీళ్లు వచ్చాయి. మార్చి 19న నా పుట్టినరోజు. అందుకే ఈ సినిమా అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ముఖ్య అతిథి రానా మాట్లాడుతూ..మోహన్ బాబుగారి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా మంచి అనుబంధం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చా. ఇక నేను చిన్నప్పటి నుంచి సునీల్ శెట్టిగారికి ఫ్యాన్. ఆయనను చూసే నేను జిమ్‌కు వెళ్లడం స్టార్ట్ చేశా. కాజల్‌కు నాకు ఇద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఈ సినిమాకు చాలామంచి కాస్ట్ ఉంది. అందరూ చక్కగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ..సునీల్ శెట్టిగారు అడగగానే ఒప్పుకున్నందుకు ఆయనకు థ్యాంక్స్. అక్క పాత్రలో చేయడానికి ఒప్పుకున్న కాజల్‌కు స్పెషల్ థ్యాంక్స్. హీరోయిన్స్ ఎవరూ సిస్టర్ పాత్ర చేయడానికి ఒప్పుకోరు. కానీ కథ నచ్చడంతో ఒప్పుకుంది. నవదీప్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్. నవీన్ చంద్ర కూడా చాలా మంచి నటుడు. సక్సెస్ మీట్ అప్పుడు కలుద్దాం. నాన్నగారి పుట్టినరోజున రిలీజ్ చేయడం అనుకోకుండా జరిగింది. ఆ రోజు అందరూ కలుద్దాం అన్నారు.
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..నా పెళ్లి తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న నేను నటించిన తొలి చిత్రం. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నర్వస్‌గా కూడా ఉంది. ఎంతో కష్టపడి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడండి. అన్నారు.
శ్రీనువైట్ల మాట్లాడుతూ.. విష్ణు ఫంక్షన్ అంటే నా సొంత ఫంక్షన్‌లాంటిది. మోహన్ బాబుగారంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన చాలా గ్రేట్ యాక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్. ఇవన్నీ తెలుసు. కానీ, నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయన ఎంత గ్రేట్ ఫాదరో తెలుసుకున్నా. ఆయన లాంటి తండ్రి ఉండడం ఆయన పిల్లల అదృష్టం. విష్ణు చాలా హానెస్ట్‌గా ఈ సినిమా తీశాడు. రియల్ లైఫ్‌లో హానెస్ట్‌గా ఉండడం ఎంత కష్టమో.. ఫిల్మ్ మేకింగ్‌లో హానెస్ట్‌గా ఉండడం అంతే కష్టం. కాజల్ లాంటి హీరోయిన్‌ను పెట్టుకుని ఎక్కడా గ్లామర్‌కు వాడుకోకుండా స్టోరీకి స్టిక్ అయి చేయడం నిజంగా హానెస్టీ. కాజల్ ఇలాంటి పాత్రను ఒప్పుకోవడం నిజంగా గ్రేట్. విష్ణుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అందరికంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నా. ఎందుకంటే తన నెక్ట్స్ డైరెక్టర్ నేనే కాబట్టి. ఆల్ ది బెస్ట్ అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. పెదరాయుడులో అన్నయ్య నాకు తమ్ముడి వేషం ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్యతో ఆ రిలేషన్ అలాగే ఉంది. మంచు ఫ్యామిలీ ఏ సినిమా చేసినా అందులో నాకు మంచి క్యారెక్టర్ ఉంటుంది. మోసగాళ్లులో కూడా నాకు మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ..మోసగాళ్లు సినిమాకు నేను 4 సీన్లు చెప్పాను. ఆ నాలుగు సీన్లకే నాకు మంచి అమౌంట్‌తో పాటు సన్ ఆఫ్ ఇండియా సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. మోసగాళ్లు సినిమాతో ఫస్ట్ లాభపడింది నేనే. అందుకు కారణమైన మంచు విష్ణుకు, నా గాడ్ ఫాదర్ మోహన్ బాబు గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అన్నారు.
నవదీప్ మాట్లాడుతూ.. ఫస్ట్ టైమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కలిపి షూట్ చేసిన సినిమా ఇది. మోసగాళ్లు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎవరు ఎవరిని మోసం చేశారా అనే క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఒక స్కామ్‌ను తీసుకుని చాలాబాగా చూపించాం. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. అన్నారు.
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మాట్లాడుతూ..మోహన్ బాబు గారి ఫ్యామిలీతో కలిసి వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ సినిమాకు పని చేసిన అందరూ చాలా కష్టపడి పని చేశారు. షూటింగ్‌లో మోహన్ బాబు గారి ఇంటి నుంచి రోజూ మంచి భోజనం వచ్చేది. చాలా బాగా చూసుకున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణుకు థ్యాంక్స్. అన్నారు.