Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్ అంటే పుస్తకాలు చదవడం : మంచు విష్ణు

Advertiesment
నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్ అంటే పుస్తకాలు చదవడం : మంచు విష్ణు
, ఆదివారం, 14 మార్చి 2021 (14:17 IST)
తన దృష్టిలో ఎంజాయ్‌మెంట్ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, పిల్లలతో సమయాన్ని గడపడమేనని హీరో మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి  కీలకపాత్ర పోషించారు. నవ్‌దీప్‌, నవీన్‌చంద్ర తదితరులు నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం గురించి మంచు విష్ణు మాట్లాడారు. 
 
తాను సంప్రదాయాలను ఎక్కువగా గౌరవిస్తుంటానని చెప్పారు. అందుకే పార్టీలకు దూరంగా ఉంటానని తెలిపారు. ముఖ్యంగా నేను, లక్ష్మి, మనోజ్... మా ముగ్గురిలో సంప్రదాయాలకు నేనే ఎక్కువగా విలువనిస్తుంటాను అని చెప్పారు. 
 
చిన్నా పెద్దా అనే పద్ధతులు నమ్ముతుంటాను. నేను కొంచెం బోరింగ్‌ పర్సన్‌. రాత్రి త్వరగా నిద్రపోవడం. ఉదయాన్నే నిద్రలేవడం.. ఇలా ఉంటుంది నా లైఫ్‌స్టైల్‌. కానీ వాళ్లిద్దరి లైఫ్‌స్టైల్‌ వేరేలా ఉంటుంది. వాళ్లిద్దరి ఆలోచనలు కొంచెం కలుస్తుంటాయని చెప్పారు. 
 
దాంతో వాళ్లిద్దరూ స్నేహితులు, పార్టీలతో ఎంజాయ్‌ చేస్తుంటారు. నా దృష్టిలో ఎంజాయ్‌మెంట్‌ అంటే పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, పిల్లలతో సమయాన్ని గడపడం అని తెలిపారు. 
 
ఇకపోతే, మనోజ్‌కు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘లేదు. అడక్కుండా సలహాలిస్తే ఆ మాటకు విలువ ఉండదు. అలాగే సలహాలిచ్చే వ్యక్తికి కూడా గౌరవం ఉండదు.. అనే దాన్ని ఎక్కువగా నమ్ముతుంటాను. అవసరమైనప్పుడు అడుగుతారు. అడిగితే తప్పకుండా ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"బీరువా" సురభికి మరో ఛాన్స్...