Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

`విన్నారా ఈ ప్రేమ కథ` చిత్రం ప్రారంభం

Advertiesment
`Vinnara Ee Prema Katha
, బుధవారం, 14 ఏప్రియల్ 2021 (17:26 IST)
priyanka, krishna, Tammareddy
న‌టుడు గౌతమ్ రాజు త‌న‌యుడు కృష్ణ, ప్రియాంక హీరో హీరోయిన్ గా న‌టిస్తున్న‌ చిత్రం "విన్నారా ఈ ప్రేమ కథ`. సి హెచ్ దొరబాబు దర్శకత్వం లో డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర నిర్మిస్తున్నారు. దాచినా దాగదు అనేది కాప్షన్. ఉగాది పర్వదినాన ప్రారంభ వేడుక నానక్ రామ్ గూడాలోని నరేష్ గార్డెన్ లో పూజ కార్యక్రమాలతో  ఘనంగా జరిగింది. ఈ చిత్రం యొక్క ప్రారంభ వేడుకకి గౌతమ్ రాజు, తమ్మారెడ్డి భరద్వాజ్, నరేష్, జీవిత రాజశేఖర్, భారత్ పారేపల్లి తదితరులు విచ్చేసి యూనిట్ సభ్యులని ఆశీర్వదించారు. ముహూర్తపు సన్నివేశానికి భారత్ పారేపల్లి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు.  సీనియర్ నరేష్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
 
అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ్, భ‌రత్ పారేపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాదించాలి. నిర్మాతలకి మంచి డబ్బు రావాలి" అని కోరుకున్నారు.
 
నిర్మాత  డాక్టర్ శ్రీధర్ రాజు యెర్ర మాట్లాడుతూ "ఉగాది పండగ రోజు మా చిత్రం ప్రారంభం కావటం చాలా సంతోషం గా ఉంది. ప్రతాప్ ప్రొడక్షన్స్ లో ఇది రెండో సినిమా. ఈ చిత్రం రేలంగి గారి కామెడీ లాగా పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరిస్తున్నాం. ఆంధ్రలోని కాకినాడ, రావులపల్లెం వంటి సహజ లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరిస్తున్నాం. మా చిత్రం అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చుతుంది" అని తెలిపారు.
 
హీరో కృష్ణ మాట్లాడుతూ "సినిమా కథ చాలా బాగుంది. దొరబాబు గారు చాలా కసితో రాసుకున్నారు ఈ కథని. ఇది ఒక పల్లెటూరి లో జరిగే కథ. మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. సరదాగా ఉంటుంది ఈ సినిమా అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.
గౌతమ్ రాజు గారు మాట్లాడుతూ, దర్శకుడు దొరబాబు చాలా కస్టపడి మంచి కథతో వచ్చాడు. చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి, నిర్మాతలకి మంచి డబ్బు రావాలి. పల్లెటూరు లో జరిగే కొత్త కథ. అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌న్న‌టి తుంప‌ర‌లో సైకిల్ పై ఆచార్య సెట్‌కు సోనూసూద్