Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Advertiesment
Puri Jagannath, Charmi, JB Narayana Rao Kondrolla

దేవీ

, సోమవారం, 30 జూన్ 2025 (17:29 IST)
Puri Jagannath, Charmi, JB Narayana Rao Kondrolla
పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాతలు స్టార్ నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేయడం ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు పెరుగుతున్నాయి.
 
ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌ ని పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో చార్మీ కౌర్  ప్రెజెంట్ గా, JB మోషన్ పిక్చర్స్‌ JB నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ తో నిర్మిస్తున్నారు. JB మోషన్ పిక్చర్స్‌తో కొలాబరేషన్ మూవీ గ్రాండియర్ ని మరింతగా పెంచుతోంది,
 
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకి సంబధించిన అన్నీ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేశారు.  
 
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
 
దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఈ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది. మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో రివిల్ చేయనున్నారు.  
 తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్