Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

Advertiesment
Vijay Sethupathi, Arumuga Kumar, Rukmini Vasanth and others

దేవీ

, గురువారం, 22 మే 2025 (13:43 IST)
Vijay Sethupathi, Arumuga Kumar, Rukmini Vasanth and others
వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాను శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి. శివ ప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
 
శ్రీ పద్మిణి సినిమాస్ అధినేత దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు కనిపిస్తోంది. అందరి మొహాల్లో సంతోషం ఉంది. ఈ కథ, కారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి గారు మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. అన్నీ సెట్ అయితే ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను ఆయనతో త్వరలోనే ప్రకటిస్తాను. ‘ఏస్’ సినిమాగానూ అందరికీ ముందుగానే కంగ్రాట్స్. మే 23న ఈ చిత్రం పెద్ద విజయం సాధించబోతోంది’ అని అన్నారు.
 
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘అరుముగ కుమార్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. నాకు సినిమాలో మొదటి చాన్స్ ఇచ్చింది కూడా ఆయనే. మళ్లీ ఇప్పుడు ఆయనతో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇందులో యాక్షన్, రొమాన్స్ అన్నీ అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా ఉంది. బి. శివ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్. ఆయనకు ఆల్ ది బెస్ట్. మే 23న మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
దర్శక,నిర్మాత అరుముగ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ సినిమాలో అన్ని రకాల అంశాలుంటాయి. యాక్షన్, రొమాన్స్, ఫన్ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఫుల్ మీల్స్‌లా ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. విజయ్ సేతుపతి గారు ఆల్ రౌండర్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మే 23న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
దివ్యా పిళ్లై మాట్లాడుతూ .. ‘‘ఏస్’ చిత్రంలో నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. విజయ్ సేతుపతి గారితో నటించడం సంతోషంగా ఉంది. మా సినిమాను అందరూ మే 23న చూడండి’ అని అన్నారు.
 
నటుడు బబ్లూ పృథ్వీ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ‘ఏస్’ ఫుల్ మీల్స్ లాంటి చిత్రం. కార్డ్‌లో ఏస్ అంటే ఒకటి.. అన్నింటి కంటే హయ్యస్ట్ కార్డ్. అరుముగ గారి మైండ్‌లో మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. రుక్మిణి, దివ్య గారికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల డైలాగ్స్ కాస్త ఇబ్బంది అయింది. కానీ ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. ఇది డార్క్ కామెడీతో రాబోతోన్న చిత్రం. అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్