King dom first day collection poster
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ "కింగ్డమ్" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఈ సినిమా డే 1 వరల్డ్ వైడ్ 39 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఒక వీక్ డే లో ఇంత భారీ వసూళ్లు సాధించడం "కింగ్డమ్" సక్సెస్ రేంజ్ ను ప్రూవ్ చేస్తోంది. సూపర్ హిట్ టాక్ తో ఈ సినిమాకు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఈ ట్రెండ్ చూస్తే ఫస్ట్ వీక్ "కింగ్డమ్" ఒక హ్యూజ్ నెంబర్ తో రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది. మరోవైపు ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద "కింగ్డమ్" సినిమా 1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ దాటి దూసుకెళ్తోంది. ఇటీవల సరైన విజయాలు లేని టాలీవుడ్ కు ఈ సినిమాతో ఒక సాలిడ్ హిట్ దక్కినట్లయింది.