Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'లైగర్' షూటింగ్ పూర్తి - ఆగస్టు 25న విడుదల

Advertiesment
'లైగర్' షూటింగ్ పూర్తి - ఆగస్టు 25న విడుదల
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:11 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్". ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి అనన్య పాండే నటిస్తున్నారు. చిత్రీకరణ కూడా పూర్తకావడంతో 'లైగర్‌'కు సంబంధించి ఒక పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలివున్నాయి. 
 
కాగా, ఈ చిత్రాన్ని ఆగస్టు 25వ తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మహాబలుడు, బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. పూరీ కనెక్ట్స్, ధర్మా మూవీస్ బ్యానర్లపై మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీమ్‌ స్టార్‌ గద్వాల్ బిడ్డ కన్నుమూత.. నువ్వెనివో నాకు తెల్వదు.. అంటూ?