దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహంపై రోజుకో వార్త కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ధ కాలం దాటిపోయినా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్‌లతో హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక నయనతార.
దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఆమె ప్రేమాయణం ఓ వైపు సాగుతూ వున్నా.. మరోవైపు పెళ్లి వార్తలు వస్తున్నా.. ఆమె మాత్రం ఏవీ పట్టించుకోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతోంది.
ఇక విఘ్నేశ్‌తో తన ప్రేమ విషయాన్ని నయన బయటికి చెప్పకపోయినా కూడా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందనే విషయం వాస్తవం. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు ఫారెన్ టూర్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ జంట.
అయితే ఈ ప్రేమ జంట ప్రేమ కథ మొదలై ఐదేళ్లు అయ్యిందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్. వాలంటైన్స్ డే సంధర్భంగా.. వారి మధ్య ప్రేమను వివరిస్తూ మా ఇద్దరి కథ మొదలై ఐదేళ్లు అయ్యింది అంటూ ధ్రువీకరించాడు.
నయనతారతో ప్రతి రోజు తనకు వాలెంటైన్స్ డేగా ఉంటుందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు. ఎన్నో అనుభూతులు తన ప్రేమతో ముడిపడి ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ పోస్టు చేసిన ఫోటోలు, ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.