Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Advertiesment
Mallidi Vashita, Chiranjeevi

దేవీ

, గురువారం, 14 ఆగస్టు 2025 (18:34 IST)
Mallidi Vashita, Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా సమయం వుంది. కానీ సినిమా ఆలస్యం అవుతూనే వుంది. తాజా ఈ సినిమాపై ఆసక్తికర అంశాన్ని దర్శకుడు వెల్లడించారు. చిరంజీవిగారితో కథ చెప్పినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. రాజమౌళి తోసహా గతంలోనూ పలువురు యమలోకం చూపారు. ఇంద్రలోకం, నాగ లోకం కూడా  చూపించారు. కానీ పురాణాల్లో 14 లోకాలున్నాయని విన్నాం. అందులో సత్య లోకం వుంది.
 
కనుక దాన్ని ఇప్పటివరకు ఎవరూ చూపించని లోకాన్ని చూపిస్తున్నాం. హాలీవుడ్ సినిమాల్లో తెల్లటి గుర్రాలు ఎగిరే సన్నివేశాలు చాలా చూశాం. అక్కడి మనుషులు కూడా పెద్ద పెద్ద చెవులతో వుంటారు. అవతార్ లో అవిచూసేవాం. వారంతా మన పురాణాల్లోంచి తీసుకున్న అంశాలే అని నేను గట్టిగా చెప్పగలను అని అన్నారు.
 
అందుకే, చిరంజీవితో సత్యలోకం చూపిస్తున్నా. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? అనేది ఆసక్తికరం పాయింట్. ఈ సినిమాలో ప్రతీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుని చేశాం. ఆగస్టు 22న మా సినిమా గురించి కూడా కొత్త అప్ డేట్ రాబోతుంది అని చెప్పారు. సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్రిషా కృష్ణన్‌, ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !